News April 15, 2024

వామ్మో.. ఒకే కుటుంబంలో 350 మంది ఓటర్లు

image

APR 19న అస్సాంలో తొలి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సోనిట్‌పూర్(D) ఫులోగురి నేపాలీ పామ్ గ్రామంలో ఒకే ఇంట్లో 350 ఓట్లు ఉన్నాయి. దివంగత బహదూర్ తాపా అనే వ్యక్తి ఐదుగురు భార్యల ద్వారా 12 మంది కొడుకులు, 9 మంది ఆడపిల్లలను కన్నారు. కోడళ్లు, అల్లుళ్లు, పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిపి జనాభా 1,200కు చేరింది. వీరంతా అదే ఊరిలో 300 ఇళ్లలో నివసిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News October 16, 2024

ఆ 3 పాపాలపై నో కాంప్రమైజ్: పాక్‌లో జైశంకర్

image

ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదంపై పోరాటమే SCO ప్రాథమిక లక్ష్యమని EAM జైశంకర్ ఇస్లామాబాద్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది మరింత కీలకమన్నారు. SCOకు నిజాయితీ సంభాషణలు, నమ్మకం, పొరుగువారితో స్నేహం, ఛార్టర్‌కు కట్టుబడి ఉండటం అవసరమని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, సప్లై చైన్ అవాంతరాలు వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాలకు అప్పులు ఆందోళనకరంగా మారాయని వెల్లడించారు.

News October 16, 2024

త్వరలోనే వారికి రూ.7,500: మంత్రి తుమ్మల

image

TG: రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే రైతు భరోసా రూ.7,500(ఏడాదికి ఎకరాకు రూ.15వేలు) ఇస్తామన్నారు. ఈ నెలాఖరులోగా రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వచ్చే నెల నుంచి రూ.2లక్షల పైబడి ఉన్నవారికి మాఫీ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని దుయ్యబట్టారు.

News October 16, 2024

ఇందిరమ్మ ఇళ్లపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

image

TG: హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహానగర భవిష్యత్తు కోసమే దీనిని తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, త్వరలోనే రూ.13 వేల కోట్లు చేస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి తెలిపారు.