News October 16, 2024
ఆ 3 పాపాలపై నో కాంప్రమైజ్: పాక్‌లో జైశంకర్
ఉగ్రవాదం, వేర్పాటువాదం, అతివాదంపై పోరాటమే SCO ప్రాథమిక లక్ష్యమని EAM జైశంకర్ ఇస్లామాబాద్‌లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది మరింత కీలకమన్నారు. SCOకు నిజాయితీ సంభాషణలు, నమ్మకం, పొరుగువారితో స్నేహం, ఛార్టర్‌కు కట్టుబడి ఉండటం అవసరమని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, సప్లై చైన్ అవాంతరాలు వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ప్రపంచ దేశాలకు అప్పులు ఆందోళనకరంగా మారాయని వెల్లడించారు.
Similar News
News November 13, 2024
రైతులకు GOOD NEWS
TG: రైతులకు అవసరమైన యంత్రాలు, ఉపకరణాలను రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రోటోవేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లను అందిస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాలు, పనిముట్ల జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
News November 13, 2024
తెలంగాణలో చలి తీవ్రత
TG: రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత పెరిగింది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. నిన్న మెదక్‌లో అత్యల్పంగా 14.2°C ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు సైతం చాలా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువగా ఉంటున్నాయి. మరోవైపు నేడు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది.
News November 13, 2024
ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు
భారత మాజీ క్రికెటర్ ధోనీకి ఝార్ఖండ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ వ్యాపార భాగస్వాములు మిహిర్ దివాకర్, సౌమ్య దాస్ తనను రూ.15కోట్ల మేర మోసం చేశారని JAN 5న రాంచీలో ధోనీ కంప్లైంట్ చేశారు. అయితే స్థానిక జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు తమపై ఆదేశించిన విచారణను సవాలు చేస్తూ దివాకర్, దాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తన స్టాండ్ ఏంటో చెప్పాలని ధోనీకి నోటీసులు ఇచ్చింది.