News April 16, 2024

వెలగపూడి విజయ పరంపర.. ఎంవీవీ కళ్లెం వేస్తారా?

image

AP: సిటీ ఆఫ్ డెస్టినీగా పిలిచే వైజాగ్‌లో కీలక నియోజకవర్గం విశాఖ తూర్పు. 2008లో సెగ్మెంట్ ఏర్పడగా అప్పటి నుంచి TDP అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ చక్రం తిప్పుతున్నారు. 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టిన ఆయన వన్స్ మోర్‌ అంటున్నారు. ఈ మాస్ లీడర్‌ను ఢీకొట్టేందుకు సిట్టింగ్ MP ఎంవీవీ సత్యనారాయణను YCP బరిలోకి దింపింది. మరి ఈ సమవుజ్జీల బిగ్ ఫైట్‌‌లో ఎవరు తడాఖా చూపిస్తారో వేచి చూడాలి.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News November 17, 2024

రేపటి నుంచి శ్రీవారి సేవా టికెట్ల బుకింగ్

image

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. ఫిబ్రవరి-2025కు సంబంధించి లక్కీ డిప్(సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 18వ తేదీ ఉ.10 గంటల నుంచి నవంబర్ 20వ తేదీ ఉ.10 వరకు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో పేర్లు వచ్చిన భక్తులు 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పేమెంట్ చేయవచ్చని TTD తెలిపింది.

News November 17, 2024

మొబైల్ వినియోగదారులకు అలర్ట్

image

బ్రెయిన్ క్యాన్సర్‌కు మొబైల్ వినియోగంతో సంబంధం లేదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజెన్సీ & WHO జరిపిన అధ్యయనంలో ఫోన్‌కు మెదడు & హెడ్ క్యాన్సర్‌తో సంబంధం లేదని తెలిసింది. 1994 నుంచి 2022 మధ్యకాలంలో 5వేల మందిపై స్టడీ చేసిన తర్వాత ఈ విషయం కనుగొన్నారు. రేడియో ఫ్రీక్వెన్సీ విద్యుదయస్కాంత క్షేత్రాలను క్యాన్సర్ కారకాలుగా గతంలో IARC పేర్కొంది.

News November 17, 2024

‘చెప్పులు’ నిషేధించాలని స్వతంత్ర అభ్యర్థి విజ్ఞప్తి.. ఎందుకంటే?

image

MHలో పరాందా నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పోలింగ్ బూత్‌ల వద్ద చెప్పులు నిషేధించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. తనకు EC చెప్పుల గుర్తు కేటాయించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం అభ్యర్థుల గుర్తు పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించడం నిషేధమని, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను నిలబెట్టేందుకు ఈ రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.