News November 17, 2024

‘చెప్పులు’ నిషేధించాలని స్వతంత్ర అభ్యర్థి విజ్ఞప్తి.. ఎందుకంటే?

image

MHలో పరాందా నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పోలింగ్ బూత్‌ల వద్ద చెప్పులు నిషేధించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశారు. తనకు EC చెప్పుల గుర్తు కేటాయించడమే దీనికి కారణమని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ప్రకారం అభ్యర్థుల గుర్తు పోలింగ్ స్టేషన్ల వద్ద ప్రదర్శించడం నిషేధమని, అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను నిలబెట్టేందుకు ఈ రిక్వెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News March 17, 2026

రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

image

AP: రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో పాలకవర్గం గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారులు రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గం ఏర్పడే వరకు వీరే పాలన చూసుకుంటారు. ఇక ఏలూరు కార్పొరేషన్‌కు జులై 29, మరో 13 పురపాలికల్లో నవంబర్ 21తో గడువు ముగియనుంది. అటు పంచాయతీల్లో APR 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.

News March 17, 2026

అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు!

image

TG: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలు అందించే బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆమోదం లభించేలా చేసి, మేడే లోపు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 3-4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. HYDలో వెల్ఫేర్ బోర్డు, వారిని వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు ప్రత్యేక సైట్, యాప్‌ను సర్కార్ సిద్ధం చేస్తోంది.

News March 17, 2026

విజయ్-రష్మిక హల్దీ వేడుకల ఫొటోలు.. వైరల్

image

గత నెలలో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక తమ హల్దీ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ రోజు హల్దీ+హోలీ మాదిరిగా రంగుల్లో తడిసిపోయామని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటికీ తన జుట్టు ఎరుపు రంగులోనే ఉందన్నారు. అద్భుతమైన వేడుకలకు సహకరించిన సిబ్బందికి థాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.