News April 16, 2024

రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారేమో..: KCR

image

TG: మెదక్ సభలో మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారేమోనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. సర్వే రిపోర్టులు చూసి రేవంత్ భయపడుతున్నారని, నారాయణపేట సభలో వణికిపోయారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వేలో తేలిపోయిందన్నారు.

Similar News

News October 13, 2024

సీఐడీ చేతికి మరో 2 కేసులు అప్పగింత

image

AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసును సీఐడీకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేసులు మంగళగిరి, తాడేపల్లి పీఎస్‌ల పరిధిలో ఉన్నాయి. విచారణ వేగవంతం కోసం ఈ నిర్ణయం తీసుకోగా, ఆయా ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ రేపు అప్పగించనున్నారు.

News October 13, 2024

క్రిశాంక్‌కు మెయిన్‌హార్ట్ సంస్థ నోటీసులు

image

TG: BRS నేత మన్నె క్రిశాంక్‌కు సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గనని, నోటీసులపై KTR, బీఆర్ఎస్ లీగల్ సెల్‌తో చర్చిస్తున్నట్లు క్రిశాంక్ బదులిచ్చారు.

News October 13, 2024

రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 14 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏలూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.