News October 13, 2024

రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 14 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏలూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.

Similar News

News November 13, 2024

చలికాలంలో ఇవి తింటున్నారా?

image

చలికాలంలో చాలా మందికి అనారోగ్యం చేస్తుంది. దీనికి కారణం రోగ నిరోధకశక్తి లేకపోవడమే. కానీ కొన్ని పదార్థాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్, ఫైబర్, ఐరన్ ఉండే బాదం, జీడిపప్పు తింటే శరీరంలోని కండరాలు, నరాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే వాల్ నట్స్, అంజీర్, పిస్తా పప్పు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నాన్ వెజ్, డీప్ ఫ్రైలకు దూరంగా ఉండటం బెటర్.

News November 13, 2024

ట్రంప్ ప్రభుత్వంలోకి మస్క్, రామస్వామి

image

డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ సమర్థత శాఖ(Department of Government Efficiency)కి వీరు నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. ‘అధిక నిబంధనల తొలగింపు, వృథా ఖర్చుల తగ్గింపు, ఫెడరల్ సంస్థల పునర్నిర్మాణం వంటి అంశాల్లో వీరు కీలకంగా వ్యవహరిస్తారు. సర్కారు వనరుల్ని వృథా చేస్తున్నవారికి నా నిర్ణయం కచ్చితంగా షాకిస్తుంది’ అని ట్రంప్ తెలిపారు.

News November 13, 2024

రైతులకు GOOD NEWS

image

TG: రైతులకు అవసరమైన యంత్రాలు, ఉపకరణాలను రాయితీపై సరఫరా చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రోటోవేటర్లు, నాగళ్లు, కల్టివేటర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ వీడర్లు, ట్రాక్టర్లు, కిసాన్ డ్రోన్లను అందిస్తామని చెప్పారు. జిల్లాల వారీగా ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని యంత్ర పరికరాలు, పనిముట్ల జాబితాను తయారు చేశామన్నారు. యాసంగి సీజన్ ప్రారంభంలోనే వీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.