News April 17, 2024
డ్రాగన్ ఆగడాలకు అంతే లేదు!
మానవ హక్కుల ఉల్లంఘన, కొవిడ్ మూలాలపై యూఎన్ రిపోర్టులను చైనా తనకు అనుకూలంగా మార్చుకుందని UN మాజీ ఉద్యోగి ఎమ్మా తన రిపోర్టులో పేర్కొన్నారు. “వుహాన్ ల్యాబ్ లీక్‌పైన ఎక్కువ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడింది. ఉయ్ఘర్ ముస్లిములపై దురాగతాలకు సంబంధించిన రిపోర్టులను తారుమారు చేసింది. మానవ హక్కుల ఉల్లంఘనపై యూఎన్‌ను ఆశ్రయించిన వారి వివరాలను కొందరు సిబ్బంది రహస్యంగా చైనాకు చేరవేస్తున్నారు” అని తెలిపారు.
Similar News
News November 18, 2024
ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఇవాళ ఉదయం AQI 793గా నమోదైంది. దేశంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఫతేబాద్(895) తర్వాతి స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో నోయిడా(559) ఉంది. కాగా ఇవాళ్టి నుంచి ఢిల్లీలో స్టేజ్-4 ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం ట్రక్కులను నగరంలోకి అనుమతించరు. మరోవైపు 10, 12వ తరగతులు మినహా మిగతా క్లాసులు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ఆప్ ప్రభుత్వం ఆదేశించింది.
News November 18, 2024
ఆ 60 వేల మందే పునాదిరాయి: మోదీ
నైజీరియాలో ఉన్న 60 వేల మంది భారతీయులు ఇరు దేశాల మధ్య బలమైన బంధాలకు పునాదిరాయిగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నందుకు అక్కడి ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నైజీరియాతో స్ట్రాటజిక్ రిలేషన్స్‌కు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. భారత ప్రధాని 17 ఏళ్ల తరువాత ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
News November 18, 2024
ఇవాళ టీటీడీ పాలకమండలి భేటీ
తిరుమలలో టీటీడీ పాలకమండలి నేడు సమావేశం కానుంది. అన్నమయ్య భవనంలో ఉ.10.15 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడి అధ్యక్షతన జరిగే సమావేశంలో 70 అంశాలపై చర్చించనున్నారు. సామాన్య భక్తులకు దర్శనంలో ప్రాధాన్యం, సనాతన ధర్మపరిరక్షణ సహా మరికొన్ని అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో ప్రాధాన్యత నెలకొంది.