News November 18, 2024
ఆ 60 వేల మందే పునాదిరాయి: మోదీ
నైజీరియాలో ఉన్న 60 వేల మంది భారతీయులు ఇరు దేశాల మధ్య బలమైన బంధాలకు పునాదిరాయిగా నిలుస్తున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నందుకు అక్కడి ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు. నైజీరియాతో స్ట్రాటజిక్ రిలేషన్స్‌కు భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. భారత ప్రధాని 17 ఏళ్ల తరువాత ఆ దేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
Similar News
News December 10, 2024
భారీగా పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.72,050కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 పెరగడంతో రూ.78,600 పలుకుతోంది. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.4వేలు పెరిగి రూ.1,04,000కు చేరింది. గత 10 రోజుల వ్యవధిలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
News December 10, 2024
స్పామ్ కాల్స్ బెడద.. తెలుగు స్టేట్స్ టాప్!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్పామ్ కాల్స్ ఇబ్బందిగా మారాయి. ఎయిర్‌టెల్ స్పామ్ రిపోర్ట్ ప్రకారం అత్యధికంగా స్పామ్ కాల్స్ గుర్తించిన రాష్ట్రాల్లో తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నాయి. ముఖ్యంగా పురుషులు(76%), అందులోనూ 36-60 ఏళ్ల మధ్యనున్న వారినే టార్గెట్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ స్పామ్ కాల్స్ రోజూ ఉదయం 11 నుంచి 3PM వరకు వస్తాయని తెలిసింది. వీకెండ్స్‌లో తక్కువగా కాల్స్ వస్తాయని వెల్లడైంది.
News December 10, 2024
పొద్దున్నే లెమన్ వాటర్ తాగుతున్నారా..
పరగడపున గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని సేవించడం చాలామందికి అలవాటు. దానిని తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. కాపర్, అల్యూమినియం గ్లాసుల్లో దీనిని తీసుకోవద్దు. పులుపు ఆ లోహాలను కరిగిస్తుంది. దాంతో అవి రక్తంలో కలవొచ్చు. చర్మ సమస్యలుంటే పుల్లని పానీయాలు తీసుకోవద్దు. ఎసిడిటీ ఉంటే అది మరింత ఎక్కువ కావొచ్చు. లెమన్ వాటర్‌ను వెంటనే తాగకపోతే విటమిన్-సి తగ్గిపోవచ్చు.