News April 17, 2024
సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబు
TG: సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఉదయం 9.30 గంటలకు పెళ్లితంతు మొదలు కానుంది. ఈ వేడుకల కోసం దేవస్థానం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆర్టీసీ 238 ప్రత్యేక బస్సులను నడుపుతుండగా.. భద్రాద్రిలో భక్తుల రద్దీ పెరిగిపోవడంతో స్థానికంగా వసతి కష్టంగా మారింది.
Similar News
News November 18, 2024
22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు.. ఉత్తర్వులు జారీ
TG: మహిళా సంఘాల బలోపేతం కోసం మహిళా శక్తి భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పాత 10 జిల్లాల్లో ఇప్పటికే ఈ భవనాలు ఉండగా, మిగతా జిల్లాల్లోనూ నిర్మించనుంది. ఒక్కో భవనానికి రూ.5కోట్లు చొప్పున మొత్తం రూ.110కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు హనుమకొండలో జరగనున్న సభలో సీఎం రేవంత్ రెడ్డి వీటి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
News November 18, 2024
నేను పారిపోలేదు: నటి కస్తూరి
తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరిని హైదరాబాద్‌లోని సినీ నిర్మాత హరికృష్ణన్ బంగ్లాలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తనకు ఎలాంటి భయం లేదని, ఎక్కడికీ పారిపోలేదన్నారు. షూటింగ్ కోసమే HYD వచ్చానని, తన ఫోన్ న్యాయవాదికి ఇచ్చినట్లు చెప్పారు. కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని కస్తూరి తెలిపారు.
News November 18, 2024
మరో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వర్షాలు!
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 23న అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ తుఫానుగా మారే ఛాన్సుందని, ఈనెల 26 లేదా 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా వస్తుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో రాయలసీమలోని అన్ని జిల్లాలు, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.