News November 18, 2024
నేను పారిపోలేదు: నటి కస్తూరి
తమిళనాడులోని తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరిని హైదరాబాద్‌లోని సినీ నిర్మాత హరికృష్ణన్ బంగ్లాలో చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే అంతకుముందు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. తనకు ఎలాంటి భయం లేదని, ఎక్కడికీ పారిపోలేదన్నారు. షూటింగ్ కోసమే HYD వచ్చానని, తన ఫోన్ న్యాయవాదికి ఇచ్చినట్లు చెప్పారు. కేసు విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని కస్తూరి తెలిపారు.
Similar News
News December 9, 2024
బీజేపీ నుంచి రాజ్యసభకు కృష్ణయ్య
మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను ఖరారు చేసింది. బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య ఇటీవల వైసీపీకి, రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ ఆయనకు మరోసారి అవకాశం కల్పించింది.
News December 9, 2024
గ్రూప్-2 పరీక్ష వాయిదాకు హైకోర్టులో పిటిషన్
TG: గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను నిర్వహించనున్నట్లు TGPSC ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే 16వ తేదీన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ కూడా ఉండటంతో గ్రూప్-2ను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
News December 9, 2024
జోరుమీదున్న Paytm షేర్లు.. ఎందుకంటే
Paytm మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు జోరుమీదున్నాయి. రూ.1007 వద్ద 52వారాల గరిష్ఠాన్ని తాకాయి. 15 నెలల రెసిస్టెన్సీని బ్రేక్ చేశాయి. జపాన్ కంపెనీ PayPayలో రూ.2364 కోట్ల విలువైన వాటాను సాఫ్ట్‌బ్యాంకుకు విక్రయించేందుకు అనుమతి లభించిందని పేటీఎం చెప్పడమే ఇందుకు కారణం. చైనా నుంచి పెట్టుబడులు రావడం, పేమెంట్ బ్యాంకు కష్టాలు తొలగిపోవడంతో కంపెనీ షేర్లు 6 నెలల్లోనే 183% రాబడి అందించాయి.