News April 17, 2024
PHOTOS: బాలరాముడికి అభిషేకం
దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో జరుగుతున్న రామనవమి వేడుకలకు బాల రాముడు సిద్ధమయ్యారు. ఉదయాన్నే స్వామివారికి పూజారులు అభిషేకం చేశారు. అనంతరం స్వామి వారిని పూలదండలతో అలంకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర Xలో షేర్ చేసింది.
Similar News
News November 18, 2024
రైళ్లన్నీ ఫుల్.. సంక్రాంతికి ఊరెళ్లేదెలా?
సికింద్రాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో సంక్రాంతి పండక్కి సొంతూర్లకు ఎలా వెళ్లాలని ప్రయాణికులంతా ఆందోళన చెందుతున్నారు. ఏటా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచకపోవడంతో ప్రస్తుతం ఉన్న రైళ్లపైనే తీవ్రంగా ఒత్తిడి ఉంటోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకూ ఫలక్‌నుమా, విశాఖ, గోదావరి, గరీభ్‌రథ్, ఈస్ట్‌కోస్ట్ సహా ఇతర రైళ్లల్లో బెర్తులే లేవు
News November 18, 2024
గ్రీవెన్స్ డేలో ఆధార్ తప్పనిసరి
AP: ప్రతి సోమవారం ఎస్పీ ఆఫీసుల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)లో ఫిర్యాదు చేసేవారికి అధికారులు కీలక సూచన చేశారు. తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు. ఫిర్యాదు పత్రానికి ఆధార్ ప్రతిని జత చేయాలని, ఇది ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అయితే ఈ నిబంధన కలెక్టర్ కార్యాలయాల్లో వర్తిస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు.
News November 18, 2024
సర్వేలో అప్పులు తప్ప ఆస్తులు చెప్పట్లేదు!
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ప్రజలు పూర్తి వివరాలు చెప్పేందుకు భయపడుతున్నారు. కులం, కుటుంబ వివరాలు, అప్పులు, చదువుల వివరాలు మాత్రమే వెల్లడిస్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతర వివరాలు చెప్పేందుకు జంకుతున్నారు. వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయం, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు తొలగిస్తారన్న అనుమానంతో ఈ వివరాలు కరెక్టుగా చెప్పడం లేదు. కొందరైతే ఆధార్ నంబర్లు ఇచ్చేందుకూ ఆలోచిస్తున్నారు.