News November 18, 2024
సర్వేలో అప్పులు తప్ప ఆస్తులు చెప్పట్లేదు!

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కులగణన సర్వేలో ప్రజలు పూర్తి వివరాలు చెప్పేందుకు భయపడుతున్నారు. కులం, కుటుంబ వివరాలు, అప్పులు, చదువుల వివరాలు మాత్రమే వెల్లడిస్తున్నారు. ఆస్తులు, పథకాల లబ్ధి, ఇతర వివరాలు చెప్పేందుకు జంకుతున్నారు. వస్తున్న స్కీమ్స్ పోతాయన్న భయం, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు తొలగిస్తారన్న అనుమానంతో ఈ వివరాలు కరెక్టుగా చెప్పడం లేదు. కొందరైతే ఆధార్ నంబర్లు ఇచ్చేందుకూ ఆలోచిస్తున్నారు.
Similar News
News March 7, 2026
ఇరాన్‌లో మరోసారి భూకంపం

US, ఇజ్రాయెల్ దాడులతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.1 తీవ్రత నమోదైంది. బందర్ అబ్బాస్‌కు 74 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు US జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈనెల 3న కూడా గెరాష్ నగర సమీపంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో <<19288652>>భూకంపం సంభవించడం<<>> తెలిసిందే.
News March 7, 2026
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. 30వేల చ.అడుగుల ఈ ఆఫీస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఈ నెల 12న ప్రారంభించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటికే ముంబైలో కార్యాలయం ఉండగా భారత్‌లో ఇది రెండోది కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాకతో HYDలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ సెక్టార్లు బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
News March 7, 2026
BREAKING: భారీ షాక్ ఇచ్చిన బంగారం ధర

కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,50,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.


