News April 17, 2024
నా కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు: మోదీ
శ్రీరాముడు భారతీయుల హృదయాలలో ఉన్నాడని PM మోదీ ట్వీట్ చేశారు. అయోధ్యలో తొలిసారి నిర్వహించుకుంటున్న రామనవమి పర్వదినాన ఆలయ నిర్మాణం కోసం ప్రాణాలు అర్పించిన సాధువులు, రామ భక్తులు, మహాత్ములను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తన కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను వీక్షించిన క్షణాలు తన మదిలో ఇంకా శక్తిని నింపుతున్నాయని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2024
మా అల్లుడు బంగారం: సుధా మూర్తి
భారతీయ సాంస్కృతిక విలువల్ని ఆచరణలో చూపుతున్నందుకు బ్రిటన్ Ex PM, అల్లుడు రిషి సునాక్‌ను సుధా మూర్తి ప్రశంసించారు. లండన్‌లో జరిగిన భారతీయ విద్యా భవన్ వార్షిక దీపావళి ఉత్సవాల్లో ఆమె ప్రసంగించారు. ఉత్తమ విద్య ప్రతిఒక్కరూ ఎగరడానికి రెక్కలిస్తే, గొప్ప సంస్కృతి మూలాల్ని పట్టిష్ఠంగా నిలుపుతుందన్నారు. భారతీయ వారసత్వ పునాదులు కలిగిన రిషి సునాక్ గర్వించదగిన బ్రిటిష్ పౌరుడని పేర్కొన్నారు.
News November 18, 2024
APPLY NOW: 457 ప్రభుత్వ ఉద్యోగాలు
UPSC ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2025కు దరఖాస్తు గడువు మరో 4 రోజుల్లో(NOV 22) ముగియనుంది. రైల్వే, టెలికం, డిఫెన్స్ లాంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 457 పోస్టులను భర్తీ చేస్తారు. బీఈ/బీటెక్ పూర్తైన 21-30 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. NOV 23-29 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష 2025 జూన్ 8న, మెయిన్స్ పరీక్ష ఆగస్టు 10న జరగనుంది. వెబ్‌సైట్: https://upsc.gov.in/
News November 18, 2024
BGTకి సరికొత్త అవతారంలో పుజారా!
‘మోడర్న్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’గా పేరొందిన పుజారా కొత్త అవతారమెత్తనున్నారు. ఆస్ట్రేలియాతో జరగనున్న BGTలో ఆయన స్టార్ స్పోర్ట్స్ హిందీ కామెంటేటర్‌గా చేయనున్నట్లు తెలుస్తోంది. టెస్టుల్లో భారత్ తరఫున కీలక ఇన్నింగ్సులు ఆడిన పుజారా గత కొంత కాలంగా ఫామ్ లేమితో జట్టుకు దూరమయ్యారు. ఇటీవల దేశవాళీలో సత్తా చాటినా ఆయనను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు. పుజారా భారత్ తరఫున 103 టెస్టుల్లో 7,195 పరుగులు చేశారు.