News November 18, 2024
BGTకి సరికొత్త అవతారంలో పుజారా!
‘మోడర్న్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్’గా పేరొందిన పుజారా కొత్త అవతారమెత్తనున్నారు. ఆస్ట్రేలియాతో జరగనున్న BGTలో ఆయన స్టార్ స్పోర్ట్స్ హిందీ కామెంటేటర్‌గా చేయనున్నట్లు తెలుస్తోంది. టెస్టుల్లో భారత్ తరఫున కీలక ఇన్నింగ్సులు ఆడిన పుజారా గత కొంత కాలంగా ఫామ్ లేమితో జట్టుకు దూరమయ్యారు. ఇటీవల దేశవాళీలో సత్తా చాటినా ఆయనను జాతీయ జట్టుకు ఎంపిక చేయలేదు. పుజారా భారత్ తరఫున 103 టెస్టుల్లో 7,195 పరుగులు చేశారు.
Similar News
News December 11, 2024
మోదీని కలిసిన రాజ్ కపూర్ ఫ్యామిలీ
దిగ్గజ హిందీ నటుడు రాజ్ కపూర్ కుటుంబ సభ్యులు ప్రధాని మోదీతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ తదితరులు మోదీని కలిశారు. రాజ్ కపూర్ 100వ జయంతి స్మారకార్థంగా నిర్వహిస్తున్న RK Film Festivalలో పాల్గొనాల్సిందిగా వారు మోదీని ఆహ్వానించారు. 13 నుంచి 15 వరకు 3 రోజులపాటు 40 నగరాల్లో 10 రాజ్ కపూర్ చిత్రాలను ప్రదర్శించనున్నారు.
News December 11, 2024
మనోజ్ మీడియా సమావేశం వాయిదా
TG: రాచకొండ సీపీ కార్యాలయంలో సీపీని కలిసిన నటుడు మంచు మనోజ్ తిరిగి జల్‌పల్లిలోని నివాసానికి చేరుకున్నారు. తాను ఎవరితో గొడవపెట్టుకోనని సీపీకి హామీ ఇచ్చారు. ఆయన సూచన మేరకు మీడియా సమావేశం వాయిదా వేశారు.
News December 11, 2024
Stock Market: ఈ రోజు కూడా ఫ్లాట్‌గానే
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా ఫ్లాట్‌గా ముగిశాయి. సెంటిమెంట్‌ను బలపరిచే న్యూస్ లేకపోవడం, గత సెషన్‌లో అమెరికా సూచీలు Dow Jones, Nasdaq, S&P500 నష్టపోవడంతో దేశీయ సూచీలు స్తబ్దుగా కదిలాయి. Sensex 16 పాయింట్ల లాభంతో 81,526 వద్ద, Nifty 31 పాయింట్లు పెరిగి 24,641 వద్ద స్థిరపడ్డాయి. FMCG, IT, ఆటో రంగ షేర్లు రాణించాయి. Trent, Baja Finance, Britannia టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.