News April 17, 2024
ఫ్యామిలీకి తెలియకుండా పరీక్ష రాసి.. 4వ ర్యాంక్
నిన్న ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో విజేతలుగా నిలిచిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. అయితే.. కేరళకు చెందిన UPSC 4వ ర్యాంకర్ సిద్ధార్థ్ రామ్‌కుమార్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే.. ఆయన పరీక్ష రాసిన విషయం తన కుటుంబ సభ్యులకు కూడా తెలియదట. టీవీలో చూశాకే తమకు తెలిసిందని తన పేరెంట్స్ చెప్పారు. గతంలోనే IPSకు ఎంపికైన సిద్ధార్థ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్నారు.
Similar News
News November 18, 2024
BREAKING.. HYDలో ఐటీ సోదాలు
HYDలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఉదయం నుంచి షాద్‌నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్‌లోని స్వస్తిక్ రియల్టర్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. షాద్‌నగర్‌లో భూవిక్రయం జరిపిన స్వస్తిక్ కంపెనీ.. బ్యాలన్స్ షీట్‌లో వివరాలు చూపకపోవడంతో ఈ ఐటీ సోదాలకు దారి తీసింది. ఇందులో రూ.300కోట్ల వరకు భూ విక్రయం జరిగినట్లు గుర్తించారు.
News November 18, 2024
లా అండ్ ఆర్డర్‌పై మండలిలో హాట్ హాట్ చర్చ
AP శాసనమండలిలో లా అండ్ ఆర్డర్‌పై చర్చ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. రాష్ట్రంలో నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా నిలుస్తామని ఆమె అన్నారు. దీంతో అనిత వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.
News November 18, 2024
బీజేపీలో చేరనున్న గహ్లోత్!
కేజ్రీవాల్ తీరుపై తీవ్ర విమర్శలు చేసి మంత్రి పదవికి <<14635271>>రాజీనామా<<>> చేసిన కైలాష్ గహ్లోత్ బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు గహ్లోత్ సన్నిహితుడు. పంద్రాగస్టున జెండా ఎగురవేసేందుకు ఆతిశీకి బదులుగా గహ్లోత్‌కు సక్సేనా అవకాశం ఇచ్చారు. పైగా లిక్కర్ కేసులో ఆయన పాత్రపై ED కూపీ లాగుతుండడంతోనే బీజేపీలో చేరుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.