News November 18, 2024

లా అండ్ ఆర్డర్‌పై మండలిలో హాట్ హాట్ చర్చ

image

AP శాసనమండలిలో లా అండ్ ఆర్డర్‌పై చర్చ అధికార, విపక్షాల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. రాష్ట్రంలో నేరాల కట్టడికి చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా అండగా నిలుస్తామని ఆమె అన్నారు. దీంతో అనిత వ్యాఖ్యలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు.

Similar News

News December 11, 2024

తొక్కిసలాట ఘటన.. హైకోర్టుకు అల్లు అర్జున్

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనపై ‘పుష్ప-2’ హీరో అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా తొక్కిసలాటలో <<14793383>>మహిళ మరణించిన<<>> సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. ఇప్పటికే థియేటర్ యజమాని, మేనేజర్‌తో పాటు సెక్యూరిటీ మేనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

News December 11, 2024

టెన్త్ క్లాస్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

AP: పదో తరగతి పరీక్షల <>షెడ్యూల్‌ను <<>>మంత్రి లోకేశ్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లిష్, 24న మ్యాథ్స్, 26న ఫిజిక్స్, 28న బయోలజీ, 31న సోషల్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు చదివేందుకు వీలైనంత సమయం తీసుకునేలా షెడ్యూల్ ఇచ్చామని, మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.
☞☞ ఉ.9.30 నుంచి మ.12.45 వరకు పరీక్షలు జరుగుతాయి.

News December 11, 2024

రూల్స్ ప్రకారమే వెయిటింగ్ లిస్ట్ టికెట్ల క్యాన్సిలేషన్ ఛార్జీలు: కేంద్రం

image

IRCTC సొంతంగా Cancel చేసే Waiting List టికెట్ల‌పై ఛార్జీల భారం మోపవద్దనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని ర‌ద్దు చేసే ఆలోచ‌న ఏమైనా ఉందా అని SP MP ఇక్రా చౌద‌రీ కేంద్రాన్ని ప్ర‌శ్నించారు. అయితే, రైల్వే ప్యాసింజ‌ర్ రూల్స్‌-2015 ప్ర‌కార‌మే Clerkage fee వ‌సూలు చేస్తున్న‌ట్టు కేంద్రం తెలిపింది. ఇలా ఎంత మొత్తంలో వసూలు చేశార‌ని ప్ర‌శ్నిస్తే, ఆ వివ‌రాలు విడిగా త‌మ వ‌ద్ద లేవ‌ని బ‌దులిచ్చింది.