News December 2, 2025

జగిత్యాల: ‘ఎన్నికల ఖర్చుల్లో తేడాలు లేకుండా చూడాలి’

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల విధులు, బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల వ్యయపరిశీలకులు మనోహర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఖర్చుల నమోదు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ఖర్చుల వివరాల్లో ఎలాంటి తేడాలు లేకుండా ప్రతిఅంశాన్ని ఖచ్చితంగా నమోదు చేస్తున్నారా అనే విషయాన్ని సూక్ష్మ పరిశీలకులు పరిశీలించాలని ఆయన పేర్కొన్నారు.

Similar News

News March 24, 2026

ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు నక్కపల్లి స్టీల్ ప్లాంట్ దిక్చూచి: సీఎం

image

నక్కపల్లిలో శంకుస్థాపన చేసిన ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు దిక్సూచి అని సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. రూ.1.36 లక్షల కోట్లతో రెండు దశలో ఏర్పాటు అవుతున్న స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్రను ఉక్కు ఆంధ్రగా మారుస్తుందన్నారు. ప్రధాని మోదీ సహకారంతో 21 నెలల్లో ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను రాష్ట్రానికి తీసుకురాగలిగామన్నారు. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్నారు.

News March 24, 2026

అట్రాసిటీ, పీసీఆర్ చట్టాలను కట్టుదిట్టం చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పీసీఆర్ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. పౌర హక్కులపై ప్రతి నెల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పింఛన్లు, ఉపాధి, శ్మశాన వాటిక అభివృద్ధి సమస్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలన్నారు.

News March 24, 2026

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యం: ఖమ్మం సీపీ

image

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడం, డ్రగ్స్ బారిన పడిన వారికి విముక్తి కలిగించడమే లక్ష్యమని సీపీ సునీల్ దత్ అన్నారు. పోలీస్ శాఖ, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ రావు, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం గాంధీచౌక్‌లో స్థానిక ప్రజలకు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.