News April 18, 2024

నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మాధవీ లత

image

శ్రీరామ నవమి శోభాయాత్రలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈక్రమంలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘నాపై నెగటివిటీని సృష్టించేందుకు ఓ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది అసంపూర్ణమైన వీడియో అని స్పష్టం చేస్తున్నా. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే వారికి క్షమాపణలు చెప్తున్నా’ అని తెలిపారు.

Similar News

News January 25, 2026

కర్నూలు: ‘శ్మశాన వాటికకు వెళ్లాలంటే.. వాగు దాటాల్సిందే’

image

తుగ్గలిలోని దళితులకు సరియైన శ్మశాన వాటిక లేక మృతదేహంపై మరొక మృతదేహం పెడుతూ అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోతున్నారు. శనివారం మరియమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడంతో ఆమెను అరకొరగా ఉన్న శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన దారి లేక సుమారు మోకాళ్ల లోతుకుపైగా ఉన్న నీళ్లు ఉన్న బురదలో వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. దళితులకు శ్మశాన వాటిక స్థలాన్ని చూపాలని కోరారు.

News January 25, 2026

హలో.. హలో.. ఈ సారైనా మేడారంలో మొబైల్ నెట్వర్క్ నెగ్గేనా!

image

మేడారం జాతర దగ్గర పడింది. భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. గత జాతరలో మాదిరిగానే ఈసారి కూడా మొబైల్ నెట్వర్క్‌లు పనిచేస్తాయా? సతాయిస్తాయా? అని భక్తులు భయపడుతున్నారు. జాతర జరిగే నాలుగు ప్రధాన రోజులు లక్షలాదిగా వచ్చే భక్తులతో నెట్వర్క్‌లపై ఒత్తిడి పెరిగి ఫోన్లు పనిచేయక జనం ఇబ్బందులు పడుతారు. ఈసారైనా మొబైల్ నెట్వర్క్‌లు పనిచేసేలా కంపెనీలు సిగ్నల్ సామర్ధ్యం పెంచాలని భక్తులు కోరుతున్నారు.

News January 25, 2026

మంచిర్యాలలో చెదురుతున్న గులాబీ గూడు..!

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగులుతుంది. ఇద్దరు మాజీ కౌన్సిలర్లు శుక్రవారం బీజేపీలో చేరగా శనివారం మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీపతి వాసు, కొందరు పట్టణ స్థాయి నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఎన్నికల్లో టికెట్లు దాదాపు ఖరారు అయినప్పటికీ వారు పార్టీ వీడటం నాయకత్వానికి మింగుడు పడటం లేదు. ఎన్నికల సమయంలో ఇంకెందరు పార్టీకి ఝలక్ ఇస్తారో అని తర్జనభర్జన పడుతున్నారు.