News April 18, 2024
నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మాధవీ లత
శ్రీరామ నవమి శోభాయాత్రలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈక్రమంలో దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘నాపై నెగటివిటీని సృష్టించేందుకు ఓ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇది అసంపూర్ణమైన వీడియో అని స్పష్టం చేస్తున్నా. ఈ వీడియో వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే వారికి క్షమాపణలు చెప్తున్నా’ అని తెలిపారు.
Similar News
News September 18, 2024
BRS విజయాలతో కాంగ్రెస్ గొప్పలు: హరీశ్ రావు
TG: బీఆర్ఎస్ హయాంలో సాధించిన విజయాలను కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకుంటోందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఇలా గొప్పలు చెప్పుకుంటూ కాలం గడుపుతోందని ఆయన మండిపడ్డారు. ‘BRS హయాంలోనే MSMEల అభివృద్ధి జరిగింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇవి మూతపడ్డా, ఇక్కడ మాత్రం సగర్వంగా ఎదిగింది. ఎంఎస్ఎంఈ రంగంలో స్థిరమైన వృద్ధి సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది’ అని ఆయన పేర్కొన్నారు.
News September 18, 2024
నెల్లూరు, పల్నాడు జిల్లాల వైసీపీ అధ్యక్షుల ఎంపిక
AP: ఉమ్మడి నెల్లూరు(D) YCP అధ్యక్షుడిగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని, పల్నాడు(D) అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని YCP నియమించింది. నెల్లూరు పార్లమెంట్ పార్టీ పరిశీలకుడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా అనిల్ కుమార్ యాదవ్‌ను నియమించింది. ఇటు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో ప.గో(D) పాలకొల్లుకి చెందిన నేత మేకా శేషుబాబుని YCP సస్పెండ్ చేసింది.
News September 18, 2024
భారత్‌లో ధనిక, పేద రాష్ట్రాలివే!
భారత్‌లోని ధనిక, పేద రాష్ట్రాల జాబితాను ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి(PMEAC) తాజాగా విడుదల చేసింది. దాని ప్రకారం.. ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, హరియాణా, తమిళనాడు దేశంలో తొలి ఐదు ధనిక రాష్ట్రాలుగా నిలిచాయి. ఇక బిహార్, ఝార్ఖండ్, యూపీ, మణిపుర్, అస్సాం రాష్ట్రాలు తొలి ఐదు పేద రాష్ట్రాలుగా ఉన్నాయి. రాష్ట్రాల GDP ప్రామాణికంగా ఈ జాబితాను రూపొందించింది.