News April 18, 2024
A-ఫారం, B-ఫారం అంటే ఏంటి?
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి B-ఫారం అనే మాట వింటుంటాం. అలాగే A-ఫారం అని కూడా ఒకటి ఉంటుంది.
A-ఫారం: పార్టీ కమిటీ ఒకరిని ఎంపిక చేసి(సాధారణంగా పార్టీ అధ్యక్షులు) A-ఫారం ఇస్తుంది. అతను ఈ పత్రాన్ని ఎన్నికల అధికారులకు అందజేస్తారు. అతనికి మాత్రమే తమ అభ్యర్థులకు B-ఫారం ఇచ్చే అధికారం ఉంటుంది.
B-ఫారం: ఎన్నికల్లో పోటీ చేసే తమ అభ్యర్థులు వీరేనంటూ ఇచ్చేదే B-ఫారం. అతనికి పార్టీ గుర్తు వర్తిస్తుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 19, 2024
పిల్లలను పెంచేందుకు పెరుగుతోన్న ఖర్చులు
దేశంలో పిల్లల పెంపకం ఖర్చు గణనీయంగా పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఖర్చులు ఇవే. పిల్లల ఆహారానికి ఏడాదికి రూ.35వేలు, బట్టలకు రూ.24 వేలు, ఆరోగ్య సంరక్షణకు రూ.20వేలు, విద్యకు రూ. 5వేల నుంచి రూ.లక్ష, డిగ్రీ చదివే పిల్లలుంటే రూ.5లక్షల వరకు, ఆటవస్తువులు & ఇతర అవసరాలకు రూ.25వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చులు ఏటా పెరుగుతూనే ఉంటాయి.
News November 19, 2024
వరంగల్‌కు వరాల జల్లు (1/2)
ప్రజాపాలన విజయోత్సవ వేడుకల వేళ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరాల జల్లు కురిపించింది.
* వరంగల్ మహానగర అభివృద్ధికి రూ.4962.47కోట్లు
* వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170కోట్లు
* కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు రూ.160.92కోట్లు
* టెక్స్‌టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలకు రూ.33.60కోట్లు
* పార్క్‌కు భూములిచ్చిన రైతులకు 863ఇళ్లు, రూ.43.15 కోట్ల పరిహారం
News November 19, 2024
వరంగల్‌కు వరాల జల్లు(2/2) (రూ.కోట్లలో..)
* కాళోజీ కళాక్షేత్రానికి రూ.85
* మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు రూ.205
* పరకాల- ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణకు రూ. 65
* పాలిటెక్నిక్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.28
* వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్‌కు రూ.32.50
* ఇన్నర్ రింగ్ రోడ్ కోసం రూ.80
* గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లకు రూ.49.50
* నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 8.3