News November 19, 2024

పిల్లలను పెంచేందుకు పెరుగుతోన్న ఖర్చులు

image

దేశంలో పిల్లల పెంపకం ఖర్చు గణనీయంగా పెరుగుతోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఖర్చులు ఇవే. పిల్లల ఆహారానికి ఏడాదికి రూ.35వేలు, బట్టలకు రూ.24 వేలు, ఆరోగ్య సంరక్షణకు రూ.20వేలు, విద్యకు రూ. 5వేల నుంచి రూ.లక్ష, డిగ్రీ చదివే పిల్లలుంటే రూ.5లక్షల వరకు, ఆటవస్తువులు & ఇతర అవసరాలకు రూ.25వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఖర్చులు ఏటా పెరుగుతూనే ఉంటాయి.

Similar News

News December 10, 2024

ఈ నొప్పి గుండెపోటు కాదు.. భయపడకండి!

image

గుండెపోటు మరణ వార్తలు ఎక్కువవడంతో ఛాతి నొప్పి వచ్చినా కొందరు ఆందోళన చెందుతుంటారు. అయితే, గుండె కండరాలకు అవసరమైనంత రక్తం లభించనప్పుడు కూడా ఇలా ఛాతిలో నొప్పి వస్తుందని, దీనిని ఆంజినా పెక్టోరిస్ అంటారని వైద్యులంటున్నారు. ‘ఇది ఛాతీలో ఒత్తిడి వల్ల వచ్చే నొప్పి మాత్రమే. నడవడం, వ్యాయామం చేయడం వల్ల శారీరక శ్రమ పెరిగి ఇలాంటివి జరుగుతుంటాయి. 5-10 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది’ అని తెలిపారు.

News December 10, 2024

పవన్ కళ్యాణ్‌కు బెదిరింపులు.. మద్యం మత్తులో నిందితుడు

image

AP: పవన్ కళ్యాణ్‌ను చంపేస్తానని <<14834003>>హత్యా బెదిరింపులకు<<>> పాల్పడిన వ్యక్తిని మల్లికార్జునరావుగా పోలీసులు గుర్తించారు. అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేదని తెలుస్తోంది. మల్లికార్జున రావు మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్లు గుర్తించారు. గతంలో అతనిపై ఓ కేసు నమోదైనట్లు సమాచారం. మరోవైపు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత ఆదేశించారు.

News December 10, 2024

వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి?

image

AP: సీఎం చంద్రబాబు ఆఫీసుకు వంగవీటి రాధ కాసేపట్లో వెళ్లనున్నారు. రాధకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది.