News April 18, 2024

కెనడా చరిత్రలో అతిపెద్ద దోపిడీ.. ఇద్దరు భారత సంతతి వ్యక్తుల అరెస్ట్

image

గత ఏడాది 20 మిలియన్ కెనడియన్ డాలర్ల(దాదాపు రూ.121 కోట్లు) విలువైన బంగారం, ఇతర వస్తువులతో ఉన్న కంటెయినర్‌ను టొరంటోలో దుండగులు చోరీ చేశారు. ఈ కేసులో పోలీసులు తాజాగా ఇద్దరు భారత సంతతి వ్యక్తులు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. దుండగులు నకిలీ పత్రాలతో ఎయిర్‌పోర్టు నుంచే కంటెయినర్‌ను తీసుకెళ్లారు. కెనడా చరిత్రలోనే ఇది అతిపెద్ద దోపిడీ. ఇప్పటి వరకు ఆ సొత్తు ఆచూకీ దొరకక పోవడం గమనార్హం.

Similar News

News November 19, 2024

వరంగల్‌కు వరాల జల్లు (1/2)

image

ప్రజాపాలన విజయోత్సవ వేడుకల వేళ ప్రభుత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాపై వరాల జల్లు కురిపించింది.
* వరంగల్ మహానగర అభివృద్ధికి రూ.4962.47కోట్లు
* వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి రూ.4,170కోట్లు
* కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు రూ.160.92కోట్లు
* టెక్స్‌టైల్ పార్కులో రోడ్లు, స్కూల్స్, సదుపాయాలకు రూ.33.60కోట్లు
* పార్క్‌కు భూములిచ్చిన రైతులకు 863ఇళ్లు, రూ.43.15 కోట్ల పరిహారం

News November 19, 2024

వరంగల్‌కు వరాల జల్లు(2/2) (రూ.కోట్లలో..)

image

* కాళోజీ కళాక్షేత్రానికి రూ.85
* మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణకు రూ.205
* పరకాల- ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణకు రూ. 65
* పాలిటెక్నిక్ కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణానికి రూ.28
* వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్‌కు రూ.32.50
* ఇన్నర్ రింగ్ రోడ్ కోసం రూ.80
* గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్లకు రూ.49.50
* నయీమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 8.3

News November 19, 2024

బ్యాంకులో 592 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

image

బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల(కాంట్రాక్ట్)కు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది. పోస్టును బట్టి బీఈ/బీటెక్/డిగ్రీ/ఎంబీఏ/పీజీ చేసిన వారు అర్హులు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్, EWS,OBC అభ్యర్థులు రూ.600, ఇతరులు రూ.100 ఫీజు చెల్లించాలి. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.
వెబ్‌సైట్: https://www.bankofbaroda.in