News April 18, 2024
కెనడా చరిత్రలో అతిపెద్ద దోపిడీ.. ఇద్దరు భారత సంతతి వ్యక్తుల అరెస్ట్
గత ఏడాది 20 మిలియన్ కెనడియన్ డాలర్ల(దాదాపు రూ.121 కోట్లు) విలువైన బంగారం, ఇతర వస్తువులతో ఉన్న కంటెయినర్‌ను టొరంటోలో దుండగులు చోరీ చేశారు. ఈ కేసులో పోలీసులు తాజాగా ఇద్దరు భారత సంతతి వ్యక్తులు సహా ఆరుగురిని అరెస్టు చేశారు. దుండగులు నకిలీ పత్రాలతో ఎయిర్‌పోర్టు నుంచే కంటెయినర్‌ను తీసుకెళ్లారు. కెనడా చరిత్రలోనే ఇది అతిపెద్ద దోపిడీ. ఇప్పటి వరకు ఆ సొత్తు ఆచూకీ దొరకక పోవడం గమనార్హం.
Similar News
News September 10, 2024
కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు: సీఎం రేవంత్
TG: కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు. ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె స్ఫూర్తి అని చెప్పారు. ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.
News September 10, 2024
మీ స్మార్ట్‌ఫోన్ రేడియేషన్ తెలుసుకోండిలా..!
మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ వెలువడుతుందన్న సంగతి తెలిసిందే. అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలని చాలామంది భావిస్తుంటారు. దీన్ని స్పెసిఫిక్ అబ్జార్షన్ రేట్(SAR) ద్వారా తెలుసుకోవచ్చు. దీన్ని ఫోన్ కొన్నప్పుడు ఇచ్చే యూజర్ మాన్యువల్ లేదా ఆ సంస్థ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. లేదంటే మీ ఫోన్లో *#07# డయల్ చేసినా ఆ వివరాల్ని తెలుసుకోవచ్చు.
News September 10, 2024
మలయాళ సినిమాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు థాంక్స్
అల్లు అర్జున్‌కు కేరళలోనూ భారీగా అభిమానులున్న విషయం తెలిసిందే. అక్కడ ఫ్యాన్స్ అసోసియేషన్లూ ఉన్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో విడుదలైన క్రైమ్ థ్రిల్లర్ ‘తలవన్’ మూవీ ఎండ్‌కార్డులో ‘ఆల్ కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్& వెల్ఫేర్ అసోసియేషన్’కు మేకర్స్ థాంక్స్ చెప్పారు. హీరోకు ధన్యవాదాలు చెప్పడం కామన్ అని, అభిమానులకూ చెప్పడం bhAAi రేంజ్‌కు నిదర్శనమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.