News April 19, 2024
భారత నేవీ కొత్త చీఫ్‌గా దినేశ్ త్రిపాఠి

భారత నేవీ చీఫ్‌గా అడ్మిరల్ హరి కుమార్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రం వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠిని కొత్త చీఫ్‌గా ప్రకటించింది. ఈనెల 30న త్రిపాఠి నేవీ చీఫ్‌గా బాధ్యతలు అందుకోనున్నారు. త్రిపాఠి గతంలో వెస్ట్రన్ నేవల్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్‌గా సేవలు అందించారు. ఎన్నో నేవీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 1985 జూలై 1న నేవీలో చేరిన త్రిపాఠి 2019లో వైస్ అడ్మిరల్/వైస్ చీఫ్ హోదా అందుకున్నారు.
Similar News
News January 27, 2026
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. ఉపసంహరణకు FEB 3 వరకు అవకాశం ఉంటుంది. FEB 11న పోలింగ్, 13న కౌంటింగ్, ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తంగా 52.43 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహిస్తామని SEC రాణి కుముదిని తెలిపారు.
News January 27, 2026
సరికొత్తగా ఆధార్ యాప్.. సేవలు సులభతరం

ఆధార్ కార్డులో మొబైల్ నంబర్‌ను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా ఆధార్ యాప్‌లో అప్డేట్ చేసుకునే సదుపాయాన్ని UIDAI కల్పించింది. రేపటి నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, బ్యాంకింగ్ సేవల కోసం ఆధార్-మొబైల్ నంబర్ లింక్ తప్పనిసరి. అలాగే ట్రావెలింగ్‌లో ఐడెంటిటీ చెకింగ్స్ వేగంగా పూర్తయ్యేలా ఆధార్ యాప్ కొత్త వెర్షన్ రేపే అందుబాటులోకి రానుంది. దీంతో ఫిజికల్ డాక్యుమెంట్స్ అవసరం ఉండదు.
News January 27, 2026
సూపర్ పోలీస్‌కి రైల్వే అత్యున్నత పురస్కారం

150 మందికిపైగా పిల్లలను రక్షించిన RPF ఇన్‌స్పెక్టర్ చందనా సిన్హా తాజాగా భారత రైల్వే అత్యున్నత అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చందన 2010లో RPFలో చేరారు. 2024లో భారత రైల్వే ఆపరేషన్ లిటిల్ ఏంజిల్స్‌లో భాగమయ్యారు. రైళ్లు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తప్పిపోయిన, అక్రమ రవాణాకు సంబంధించి 152మంది, బచ్‌పన్ బచావో సమితితో కలిసి మరో 41మంది పిల్లలను రక్షించారు.


