News April 19, 2024

భారత నేవీ కొత్త చీఫ్‌గా దినేశ్ త్రిపాఠి

image

భారత నేవీ చీఫ్‌గా అడ్మిరల్ హరి కుమార్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రం వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠిని కొత్త చీఫ్‌గా ప్రకటించింది. ఈనెల 30న త్రిపాఠి నేవీ చీఫ్‌గా బాధ్యతలు అందుకోనున్నారు. త్రిపాఠి గతంలో వెస్ట్రన్ నేవల్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్‌గా సేవలు అందించారు. ఎన్నో నేవీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 1985 జూలై 1న నేవీలో చేరిన త్రిపాఠి 2019లో వైస్ అడ్మిరల్/వైస్ చీఫ్ హోదా అందుకున్నారు.

Similar News

News September 19, 2024

ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి: షర్మిల

image

AP: తిరుమలను అపవిత్రం చేస్తూ TDP, YCPలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఫైరయ్యారు. ‘లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారన్న CBN వ్యాఖ్యలు తిరుమల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయి. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే తక్షణం ఉన్నతస్థాయి కమిటీ వేయండి. లేదా CBIతో విచారణ జరిపించండి. ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చండి’ అని ట్వీట్ చేశారు.

News September 19, 2024

సీబీఐ విచారణ వేయండి: అంబటి రాంబాబు

image

AP: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆరోపణ చేయడం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతావా చంద్రబాబు’ అని వైసీపీ ట్వీట్ చేసింది. కాగా, నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారుచేశారని చంద్రబాబు నిన్న వ్యాఖ్యానించారు.

News September 19, 2024

పోలీసుల అదుపులో జానీ మాస్టర్

image

అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచారం కేసులో పరారీలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసులకు చిక్కారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఎస్‌వోటీ పోలీసులు అతడిని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోవైపు మహిళా కమిషన్ ఆదేశాలతో బాధితురాలికి భద్రతను పెంచారు.