News April 19, 2024

MI కెప్టెన్‌కు రూ.12 లక్షల ఫైన్

image

పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందిన ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ షాకిచ్చింది. ఆ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు భారీ జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్ వేసింది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే ఢిల్లీ కెప్టెన్ పంత్‌కు రెండు సార్లు, గుజరాత్ కెప్టెన్ గిల్‌కు ఒకసారి జరిమానా విధించిన విషయం తెలిసిందే.

Similar News

News February 5, 2026

నర్సీపట్నం: అటవీ శాఖకు రూ.7.68 లక్షల ఆదాయం

image

జిల్లా అటవీశాఖ కార్యాలయంలో బుధవారం చేపట్టిన జీడిమామిడి తోటల వేలం పాటలో ప్రభుత్వానికి రూ.7.68 లక్షల ఆదాయం సమకూరినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఎలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్లో ఉన్న 22 జీడి మామిడి తోటలకు వేలంపాట నిర్వహించినట్లు పేర్కొన్నారు. వేలం పాడుకున్నవారు మొత్తాన్ని చెల్లించి తోటల్లో ఫల సాయం పొందవచ్చునని ఫారెస్ట్ రేంజర్ రాజేశ్వరరావు చెప్పారు.

News February 5, 2026

గులాబీ నేతలకు ‘చపాతీ రోలర్’ గుబులు

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో BRS అభ్యర్థులకు ‘చపాతీ రోలర్’ గుర్తు గుబులు పుట్టిస్తోంది. ADR పార్టీ అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించిన ఆ గుర్తు కారును పోలి ఉందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో గుర్తులపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లోనూ ఇలాంటి గుర్తుల వల్ల ఓట్ల నష్టం జరిగిందని BRS పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని రద్దు చేయాలని ECని కూడా కోరింది.

News February 5, 2026

పశువుల పాలు పితికిన తర్వాత జాగ్రత్తలు

image

పాలు పితికిన తర్వాత పశువును అరగంట వరకు నేలపై పడుకోనీయకూడదు. పాలు పితకడం వల్ల పశువుల చనురంధ్రాలు తెరచుకొని ఉంటాయి. అప్పుడు ఆవు/గేదె పడుకుంటే ఆ రంధ్రాల నుంచి బ్యాక్టీరియా త్వరగా పొదుగులో చేరి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఒక పశువు పాలు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కున్న తర్వాతే మరో పశువు పాలు తీయాలి. దీని వల్ల ఒక పశువుకు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే ముప్పు తగ్గుతుంది.