News April 19, 2024
MI కెప్టెన్‌కు రూ.12 లక్షల ఫైన్
పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందిన ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ షాకిచ్చింది. ఆ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు భారీ జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్ వేసింది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే ఢిల్లీ కెప్టెన్ పంత్‌కు రెండు సార్లు, గుజరాత్ కెప్టెన్ గిల్‌కు ఒకసారి జరిమానా విధించిన విషయం తెలిసిందే.
Similar News
News September 10, 2024
జియో రీఛార్జ్ ఆఫర్.. ఇవాళే లాస్ట్
రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం సందర్భంగా తెచ్చిన <<14033644>>ఆఫర్లు<<>> నేటితో ముగియనున్నాయి. రూ.899తో రీఛార్జ్ చేస్తే 90 రోజుల పాటు వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటాతో పాటు మరో 20GB అదనంగా వస్తుంది. 10 ఓటీటీలు, జొమాటో 3 నెలల గోల్డ్ మెంబర్‌షిప్ వస్తాయి. రూ.999తో 98 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. ఇక రూ.3,599తో 365 రోజుల పాటు రోజుకు 2.5GB డేటా లభిస్తుంది. పై 3 ప్లాన్లకు అన్‌లిమిటెడ్ 5G వాడుకోవచ్చు.
News September 10, 2024
13-04-2029: భూమికి అత్యంత సమీపానికి భారీ గ్రహశకలం
అంతరిక్షం నుంచి భూమివైపు దూసుకొస్తోన్న ఓ భారీ గ్రహశకలాన్ని ఇస్రో పర్యవేక్షిస్తోంది. దీనిని ఈజిప్ట్ దేవుడు ‘అపోపిస్’ పేరుతో సైంటిస్టులు పిలుస్తున్నారు. 2029 ఏప్రిల్ 13న భూమికి కేవలం 32,000 కిలోమీటర్ల సమీపంలో ప్రయాణిస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రహశకలం 340-450 మీటర్ల వ్యాసం ఉంటుందని తెలిపారు. 300 మీటర్ల కంటే పెద్దదైన గ్రహశకలం ఢీకొడితే ఓ ఖండం నాశనమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
News September 10, 2024
ALERT: దీనిపై క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ హ్యాక్!
కష్టపడి సంపాదించిన సొమ్మును సైబర్ నేరగాళ్లు లూటీ చేస్తున్నారు. తాజాగా HDFC బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపిస్తున్నారు. APK ఫైల్ పంపించి ఇన్‌స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియక దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి అందులోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి రూ.74వేలు పోగొట్టుకున్నాడు. ఇలాంటి APKఫైల్స్‌ను అస్సలు ఓపెన్ చేయకండి. SHARE IT