News April 19, 2024
‘మంజుమ్మెల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మంజుమ్మెల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మే 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఏప్రిల్ 5న తెలుగులోనూ రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలోకి రానుంది.
Similar News
News November 19, 2024
ఇవాళ పోలీసు విచారణకు ఆర్జీవీ!
AP: సోషల్ మీడియా పోస్టుల విచారణకు సంబంధించి డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మను ఇవాళ ఒంగోలు పోలీసులు విచారిస్తారని తెలుస్తోంది. ఆ వెంటనే ఆయనను అరెస్ట్ చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు, లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌ను కించపరుస్తూ RGV సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొందరు మద్దిపాడు PSలో ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
News November 19, 2024
రోజుకు 14గంటలు పనిచేయాల్సిందేనన్న CEO.. నెట్టింట విమర్శలు!
ఉద్యోగులు వారానికి 70గంటలు పనిచేయాలన్న ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు చనిపోతున్నారని నెట్టింట విమర్శలూ వచ్చాయి. తాజాగా భారత సంతతి వ్యక్తి, శాన్‌ఫ్రాన్సిస్కోలోని ‘గ్రెప్లైట్’ CEO దక్ష్ గుప్తా కూడా రోజుకు కనీసం 14గంటలు పనిచేయాలని చెబుతున్నారు. ఒక్కోసారి ఆదివారాలు వర్క్ చేయాలని చెప్పారు. దీంతో నారాయణమూర్తికి శిష్యుడు దొరికాడరనే చర్చ మొదలైంది.
News November 19, 2024
OTD: దివిసీమ విషాదానికి 47 ఏళ్లు
AP: దివిసీమ ఉప్పెనకు నేటితో సరిగ్గా 47 ఏళ్లు పూర్తయ్యాయి. 1977 NOV 19న అర్ధరాత్రి తాటి చెట్ల ఎత్తున, తీరం నుంచి 8 కి.మీ వరకు అలలు పోటెత్తాయి. కృష్ణా జిల్లాలోని నాలి, సొర్లగొంది, సంగమేశ్వరం, గుల్లలమోద, హంసలదీవి వంటి ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోయాయి. నిద్రలో ఉన్నవారు నిద్రలోనే జల సమాధయ్యారు. 10 వేల మందికిపైగా ప్రజలు, దాదాపు పశువులన్నీ మరణించాయి. ఘటన జరిగిన 3 రోజులకు బాహ్య ప్రపంచానికి తెలిసింది.