News November 19, 2024
ఇవాళ పోలీసు విచారణకు ఆర్జీవీ!
AP: సోషల్ మీడియా పోస్టుల విచారణకు సంబంధించి డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మను ఇవాళ ఒంగోలు పోలీసులు విచారిస్తారని తెలుస్తోంది. ఆ వెంటనే ఆయనను అరెస్ట్ చేస్తారని వార్తలు కూడా వస్తున్నాయి. గతంలో సీఎం చంద్రబాబు, లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్‌ను కించపరుస్తూ RGV సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొందరు మద్దిపాడు PSలో ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదైంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
Similar News
News December 7, 2024
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఎన్ని గంటలకంటే?
TG: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సా.6.05 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఇప్పటికే ప్రభుత్వం తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు ఆహ్వానం పంపారు.
News December 7, 2024
నో పవర్ షేరింగ్ ఫార్ములా: డీకే శివకుమార్
CM సిద్దరామయ్య, తన మధ్య ఎలాంటి పవర్ షేరింగ్ ఫార్ములా లేదని DK శివకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయంలో పార్టీ నేతలెవరూ మాట్లాడవద్దన్నారు. తానెప్పుడూ ఏ ఫార్ములా గురించి మాట్లాడలేదని, రాజకీయ అవగాహనతో ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందే CMతో ఒప్పందం కుదిరిందని ఇటీవల DK వ్యాఖ్యానించగా, అలాంటి ఒప్పందం ఏమీ లేదని CM కొట్టిపారేశారు. దీంతో రచ్చ మొదలైంది.
News December 7, 2024
ఆ కారు పేరు మార్చేసిన మహీంద్రా
మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ కారు మోడల్ పేరును మార్చాలని నిర్ణయించింది. ఇటీవల SUV మోడల్స్‌లో BE 6e విడుదల చేసింది. అయితే మోడల్ పేరులో 6e వాడకంపై విమానయాన సంస్థ IndiGo అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కింది. ఏళ్లుగా తమ బ్రాండ్ ఐడెంటిటీలో 6eని వాడుతున్నామని, దీనిపై తమకు ట్రేడ్‌మార్క్ హక్కులు ఉన్నాయంటూ వాదించింది. దీంతో మహీంద్రా తన BE 6e మోడల్‌ను BE 6గా మార్చింది.