News April 19, 2024

SHOCKING: ఒక వ్యక్తిలో 613 రోజులపాటు కొవిడ్

image

నెదర్లాండ్స్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడు 613 రోజులపాటు కొవిడ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడ్డాడు. ఒక వ్యక్తి శరీరంలో అత్యధిక కాలం వైరస్ ఉన్న ఘటన ఇదేనని పరిశోధకులు వెల్లడించారు. గత ఏడాది చనిపోయే సమయానికి అతనిలో దాదాపు 50 సార్లు వైరస్ మ్యుటేషన్ అయ్యిందట. బలహీన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల శరీరాలను వైరస్‌లు ఆవాసాలుగా చేసుకుని పరివర్తన చెందుతాయన్నారు. అలాంటివారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Similar News

News November 19, 2024

రష్యా VS ఉక్రెయిన్: వెయ్యి రోజుల వినాశనం విలువెంతంటే?

image

రష్యా, ఉక్రెయిన్ వివాదం మొదలై నేటికి 1000 రోజులు. WW II తర్వాత అత్యంత వినాశకర యుద్ధం ఇదేనని విశ్లేషకుల అంచనా. రెండువైపులా 10లక్షలకు పైగా మరణించారని సమాచారం. ఉక్రెయిన్‌లో ఐదో వంతు అంటే గ్రీస్‌తో సమానమైన భూభాగాన్ని రష్యా అధీనంలోకి తీసుకుంది. 2022తో పోలిస్తే ఆ దేశ ఎకానమీ 33% పడిపోయింది. మొత్తంగా $152 బిలియన్లు నష్టపోయింది. ఒకప్పటిలా మౌలిక సదుపాయాలు నిర్మించాలంటే $485 బిలియన్లు అవసరమని WB అంచనా.

News November 19, 2024

నారా రోహిత్‌కు ప్రధాని మోదీ లేఖ

image

టాలీవుడ్ హీరో నారా రోహిత్‌కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడి మృతికి ప్రధాని సంతాపం తెలిపారు. రామ్మూర్తి అందరినీ విడిచి వెళ్లినా, కుటుంబసభ్యులు, స్నేహితులు, ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. ఈ విషాదం నుంచి రోహిత్‌ త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా నిలబడాలని ఆయన కోరుకున్నారు. ఇందుకు ప్రధాని మోదీకి రోహిత్ కృతజ్ఞతలు తెలిపారు.

News November 19, 2024

‘నువ్వు బతికి వేస్ట్.. చచ్చిపో’ అనడంతో యువతి ఆత్మహత్య

image

TG: తెలిసిన యువకుడు వాట్సాప్‌లో అసభ్యకర మెసేజ్‌లు చేయడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలో జరిగింది. హాసిని(20)కి నిఖిల్‌తో ఇంటర్‌లో పరిచయం ఏర్పడింది. తరచూ ఆమెకు వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతూ వేధించేవాడు. ఆమె ఇన్‌స్టా అకౌంట్‌ను హ్యాక్ చేసి పోస్టులు పెట్టేవాడు. తాజాగా ఆమెను ‘నువ్వు బతికి వేస్ట్.. చచ్చిపో’ అని అనడంతో పాటు అసభ్యంగా దూషించడంతో హాసిని సూసైడ్ చేసుకుంది.