News April 20, 2024
తేలిపోయిన చెన్నై బౌలర్లు.. ఫ్యాన్స్ అసంతృప్తి

IPL: లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు తేలిపోయారు. రెండు వికెట్లు తీసేందుకే బౌలర్లు శ్రమించాల్సి వచ్చింది. ముఖ్యంగా తుషార్ దేశ్‌పాండే ప్రదర్శనపై ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 19వ ఓవర్‌లో రెండు వైడ్లు, ఓ నోబాల్ వేయడమే ఇందుకు కారణం. 18వ ఓవర్ ముగిసే సమయానికి లక్నో 12 బంతుల్లో 12 పరుగులు చేయాల్సి ఉంది. కానీ తుషార్ చెత్త ప్రదర్శన వల్ల లక్నోకు మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయం వరించింది.
Similar News
News March 13, 2026
కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు

చెన్నైలోని కామరాజర్ పోర్టు 14 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ, బీకామ్ అర్హత గలవారు మార్చి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.25,250-రూ.50,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kpl.cbtexam.in
News March 13, 2026
ఏపీ క్యాబినెట్ సమావేశం.. 27 అంశాలకు ఆమోదం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ భేటీ ముగిసింది. 27 అజెండా అంశాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా అనారోగ్యం కారణంగా ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత సహా మంత్రులు నాదెండ్ల మనోహర్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, ఎండీ ఫరూక్ హాజరుకాలేదు.
News March 13, 2026
అబ్రార్‌ది యునిక్ బౌలింగ్.. అందుకే తీసుకున్నాం: SRH హెడ్ కోచ్

The Hundred(ఇంగ్లండ్) టోర్నీ కోసం పాక్ స్పిన్నర్ అబ్రార్‌ను తీసుకోవడంపై SRH హెడ్ కోచ్ వెటోరీ స్పందించారు. ‘అతనిది యునిక్ బౌలింగ్. ఎన్నో వేరియేషన్స్‌తో బౌలింగ్ చేస్తారు. ఇలాంటి ప్లేయర్లను గతంలో చూసి ఉండరు. టోర్నీకి అందుబాటులో ఉంటాడనే వేలంలో కొనుగోలు చేశాం’ అని పేర్కొన్నారు. కాగా పాక్ ఆటగాడిని సన్ రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడంపై వస్తున్న <<19368622>>తీవ్ర విమర్శలపై<<>> ఓనర్ కావ్యా మారన్ స్పందించలేదు.


