News April 20, 2024

ఈ తెగ ప్రజలు మొదటిసారి ఓటేశారు

image

దేశంలో నిన్న లోక్‌సభ తొలి విడత ఎన్నికలు జరిగిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అండమాన్ & నికోబార్ దీవుల్లో షొంపెన్ తెగకు చెందిన ఏడుగురు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బూత్ వద్ద నిలబడి ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లోనూ 56 గ్రామాల ప్రజలు మొదటిసారి ఓటు వేశారు. <<-se>>#Elections2024<<>>

Similar News

News April 1, 2026

భారీగా పెరిగిన బంగారం ధర.. కారణం ఇదే

image

పశ్చిమాసియాలో ఘర్షణలు తగ్గొచ్చనే అంచనాలు, బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించవనే నమ్మకంతో బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. దీంతో మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ రెండుసార్లు రేట్లు ఎగిశాయి. HYD బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఏకంగా ₹3,440 పెరిగి ₹1,52,950 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹3,150 పెరిగి ₹1,40,200కు చేరింది. ఇక కేజీ వెండి ధర ₹2,65,000గా ఉంది.

News April 1, 2026

ధురంధర్-2: పుష్ప-2, బాహుబలి-2 రికార్డులు బ్రేక్ అవుతాయా?

image

‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 14 రోజుల్లోనే ₹1,435 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. త్వరలోనే ₹1,500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే పుష్ప-2 నెలకొల్పిన ₹1,800 కోట్ల రికార్డును మాత్రం బ్రేక్ చేయడం ఈ సినిమాకు పెద్ద టాస్కే. ఇక బాహుబలి-2 పేరిట ఉన్న ₹2,000 కోట్ల రికార్డును అందుకోవడం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు.

News April 1, 2026

పెరగనున్న మారుతీ కార్ల ధరలు!

image

తమ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మారుతీ సుజుకీ ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం వల్ల కమొడిటీ ధరలు పెరగడం, గతేడాది GST తగ్గింపు వల్ల వచ్చిన లాభాలు తుడిచిపెట్టుకుపోవడమే అందుకు కారణమని వివరించింది. కార్ల తయారీలో వాడే ఆయిల్, గ్యాస్ సహా కీలక లోహాల ధరలు పెరిగినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు సప్లైలో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ.. రాబోయే రోజుల్లో ఉండొచ్చని అంచనా వేసింది.