News April 20, 2024
టెట్ దరఖాస్తులు.. నేడే లాస్ట్ డేట్
TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. మరోసారి గడువు పెంచే ప్రసక్తే లేదని, అర్హత ఉన్నవారు వెంటనే అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10నే ముగియాల్సి ఉండగా, విజ్ఞప్తుల ఆధారంగా ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ఏవైనా తప్పులు ఉంటే నేడు సరిచేసుకోవచ్చని చెప్పారు. సైట్: schooledu.telangana.gov.in
Similar News
News November 19, 2024
వివేకా హత్య కేసు.. అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు
AP: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న YCP ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని డా.చైతన్య రెడ్డి జైలులో బెదిరించాడని సునీత తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో ప్రతివాదులైన అవినాశ్ రెడ్డి, చైతన్య రెడ్డికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
News November 19, 2024
ఫ్రీబీస్‌తో హిమాచల్ దివాలా: నెక్ట్స్ AP, TG?
విద్యుత్ కంపెనీల బకాయిలు తీర్చేందుకు భవనాలను వేలం వేస్తున్న హిమాచల్ ప్రదేశ్ దుస్థితి TG, AP, కర్ణాటక, కేరళను భయపెడుతోంది. అక్కడిలాగే ఇక్కడా ఉచితాలు అమలు చేయడం తెలిసిందే. పరిమితికి మించి అప్పులు చేయడమే కాకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసేలా పథకాల పెట్టాయి. కొత్త ఆదాయం లేకపోవడంతో సెస్సుల రూపంలో పన్నులు వేస్తున్నాయి. పరిస్థితి మారకుంటే కష్టమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మీరేమంటారు?
News November 19, 2024
అత్యాచారం కేసులో నటుడికి ముందస్తు బెయిల్
లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు సిద్దిఖ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు అత్యున్నత ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇచ్చింది. అయితే పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో సమర్పించి, విచారణకు సహకరించాలని ఆదేశించింది. మరోవైపు సిద్దిఖ్‌పై ఫిర్యాదు చేయడానికి 8 ఏళ్లు ఎందుకు పట్టిందని బాధితురాలి లాయర్‌ను కోర్టు ప్రశ్నించింది. కాగా సిద్దిఖ్ తనపై 2016లో అత్యాచారం చేశాడని ఓ నటి ఈ ఏడాది ఆగస్టులో ఫిర్యాదు చేశారు.