News November 19, 2024
వివేకా హత్య కేసు.. అవినాశ్ రెడ్డికి సుప్రీం నోటీసులు

AP: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న YCP ఎంపీ అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వైఎస్ సునీత వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అప్రూవర్‌గా మారిన వ్యక్తిని డా.చైతన్య రెడ్డి జైలులో బెదిరించాడని సునీత తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో ప్రతివాదులైన అవినాశ్ రెడ్డి, చైతన్య రెడ్డికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
Similar News
News November 16, 2025
కార్తీక మాసంలో ఇవి ఆచరించలేదా?

కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం చేస్తారు. అయితే తులసి చుట్టూ ప్రదక్షిణలు, ఉసిరి చెట్టు పూజ, దాని కింద వనభోజనం, శివుడితో పాటు కేశవుడి కథలు కూడా వినడం, దానధర్మాల్లో పాల్గొనడం.. వంటివి కూడా చేయాలని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇవి చేయకపోతే.. రేపు కార్తీక మాస చివరి సోమవారం రోజున ఆచరించవచ్చని సూచిస్తున్నారు. ఫలితంగా శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో సకల పాపాలు తొలగి, శుభాలు కలుగుతాయని నమ్మకం.
News November 16, 2025
అరుదైన రికార్డు.. దిగ్గజాల జాబితాలో జడేజా

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్ల ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియెల్ వెటోరీ వంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం. జడేజా నిన్న బ్యాటింగ్‌లో 27 పరుగులు చేసి, 4 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అతడి ఖాతాలో 4017 రన్స్, 342 వికెట్స్ ఉన్నాయి.
News November 16, 2025
కార్తీకంలో నదీ స్నానం చేయలేకపోతే?

కార్తీక మాసంలో నదీ స్నానం చేయలేని భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. స్నానం చేసే నీటిలో గంగాజలం/నదీ జలాన్ని కలుపుకొని స్నానమాచరించవచ్చు. ఇది నదీ స్నానం చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అది కూడా సాధ్యం కాకపోతే, స్నానం చేసేటప్పుడు ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ…’ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా నదీ స్నానం చేసిన ఫలం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.


