News April 20, 2024
నా భార్యకు టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారు: ఇమ్రాన్

తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్ క్లీనర్ కలిపిన ఆహారాన్ని ఇస్తున్నారని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని జైల్లో ఉండగా, బీబీ గృహనిర్బంధంలో ఉన్నారు. ‘విషపూరిత ఆహారం కారణంగా బీబీ పొట్టలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. తనకు ఏమైనా అయితే నేను బతికున్నంతకాలం జనరల్ అసీం మునీర్‌ను వదిలిపెట్టేది లేదు’ అని ఇమ్రాన్ పేర్కొన్నట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది.
Similar News
News January 26, 2026
మినుములో మారుకా పురుగు.. వేపనూనెతో చెక్

మినుము మొగ్గ, పిందె దశలలో మారుకా మచ్చల పురుగు ఆశించి నష్టం కలిగిస్తుంది. ఒక తల్లి పురుగు 200-500 గుడ్లను పెడుతుంది. వాటి లార్వాలు బయటకు వచ్చి మొగ్గలు, పిందెలను తినేస్తాయి. దీంతో దిగుబడి తగ్గిపోతుంది. ఈ పురుగు నివారణకు 5మి.లీ వేప నూనె లేదా నొవల్యూరాన్ 1.0మి.లీ లేదా క్లోరిపైరిఫాన్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 5-10 రోజుల వ్యవధిలో ఈ మందులను మార్చి పిచికారీ చేయాలి.
News January 26, 2026
HAM రోడ్ల పనులకు ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ!

TG: రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(HAM)లో అభివృద్ధి చేయడానికి గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం ఉంటుందని కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో వారికి అడ్వాన్స్ కింద 10%, వర్క్ ముగియగానే 30% బిల్లులు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. మిగతా 60% పదిహేనేళ్లలో చెల్లించేలా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వనుంది. తద్వారా పనులు స్పీడప్ అవుతాయని భావిస్తోంది.
News January 26, 2026
ఎక్కువ వెల గొడ్డును, తక్కువ వెల గుడ్డను కొనరాదు

ఎక్కువ ధర పెట్టి పశువును కొన్నప్పుడు, అది అనుకోకుండా మరణిస్తే యజమానికి భారీ నష్టం వాటిల్లుతుంది. అలాగే మరీ తక్కువ ధరకు వస్తున్నాయని నాణ్యత లేని బట్టలు కొంటే అవి చిరిగిపోయి, రంగు వెలిసి, ముడుచుకుపోతాయి. అందుకే ఏదైనా వస్తువు కొనేటప్పుడు దానితో ముడిపడి ఉన్న ప్రమాదం, మన్నికను దృష్టిలో ఉంచుకోవాలి. అనవసర ఆడంబరానికి పోయి ఎక్కువ వెల పెట్టకూడదు, అతి తక్కువ ధరకు ఆశపడి నాణ్యత లేని వస్తువును తీసుకోకూడదు.


