News April 20, 2024

మస్క్ భారత పర్యటన వాయిదా

image

టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా X వేదికగా తెలియజేశారు. టెస్లాకు సంబంధించిన ముఖ్యమైన పనులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ఏడాదిలోనే భారత్‌లో పర్యటించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు మస్క్ ఆసక్తి కనబరుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటనపై సందిగ్ధత నెలకొంది.

Similar News

News March 21, 2026

దేశాన్ని అమ్మేశారు.. కేంద్రంపై మమత ఫైర్

image

ఇంధన ధరలు పెంచాలని కేంద్రం ప్లాన్ చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. దేశాన్ని అమ్మేశారని మండిపడ్డారు. ‘మన్మోహన్ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.400 ఉండేది. ఇప్పుడు రూ.1,100 చేశారు. రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతాయి’ అని చెప్పారు. మరోవైపు బెంగాల్‌లో అప్రకటిత రాష్ట్రపతి పాలన నడుస్తోందని ఫైరయ్యారు. ప్రధాని మోదీ నుంచి దేశాన్ని కాపాడటమే తనకు ప్రాధాన్యమని అన్నారు.

News March 21, 2026

SLBCలో రెండు వైపులా తవ్వకాలు: ఉత్తమ్

image

TG: SLBC ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ‘ఇప్పటికే దేవరకొండ నుంచి ఔట్‌లెట్ పనులు జరుగుతున్నాయి. రెండు వైపులా నిరంతరాయంగా పనులు కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రూల్స్ కఠినంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. సొరంగ మార్గంలో గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని సచివాలయంలో జరిగిన సమీక్షలో సూచించారు.

News March 21, 2026

‘ఒత్తిడికి లొంగేది లేదు’.. అమెరికాకు శ్రీలంక షాక్!

image

అమెరికా యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు పర్మిషన్ నిరాకరించి శ్రీలంక షాక్ ఇచ్చింది. ఈ విషయాన్ని లంక అధ్యక్షుడు దిస్సనాయకే పార్లమెంటులో వెల్లడించారు. ‘మట్టాల ఎయిర్‌పోర్టులో ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేందుకు ఈ నెల 4, 8 తేదీల్లో వచ్చిన 2 రిక్వెస్టులను తిరస్కరించాం. ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి. అయినా మేం లొంగిపోము. మిడిల్ ఈస్ట్ యుద్ధం సవాళ్లు విసురుతోంది. న్యూట్రల్‌గా ఉండేందుకు సాధ్యమైనదంతా చేస్తాం’ అని చెప్పారు.