News April 20, 2024
జనసేన అభ్యర్థి ఆస్తి రూ.894 కోట్లు!

AP: తనకు రూ.894.92 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి అఫిడవిట్‌లో వెల్లడించారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, విద్యాసంస్థలు, భూములు, నగలు, బ్యాంకుల్లో డిపాజిట్ల వంటి రూపంలో ఆస్తులున్నాయి. బ్యాంకులో రూ.4.42 కోట్లు, చేతిలో రూ.1.15 లక్షల నగదు ఉన్నాయి. చరాస్తులు రూ.856.57 కోట్లు, స్థిరాస్తులు రూ.15.70 కోట్లు, రూ.2.69 కోట్ల అప్పు ఉన్నట్లు మాధవి తెలిపారు.
Similar News
News March 18, 2026
ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ఎప్పుడంటే?

AP: 2026-27 ఇంటర్ అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. సెకండియర్ విద్యార్థులకు ఏప్రిల్ 1న కాలేజీలు రీఓపెన్ కానున్నాయి. ఆ రోజు నుంచి 23వ తేదీ వరకు క్లాసులు నిర్వహిస్తారు. ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1న ఫస్టియర్, సెకండియర్ క్లాసులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 10 నుంచి 20 వరకు దసరా, 2027 JAN 9-17 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.
News March 18, 2026
గ్రూప్-2లో పోస్టుల సంఖ్యను పెంచాలి: చిరంజీవి

AP: గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెంచాలని MLC వేపాడ చిరంజీవి సీఎస్ సాయిప్రసాద్‌ను కోరారు. నిరుద్యోగుల సమస్యలపై CSకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2లో డిప్యూటీ తహశీల్దార్ పోస్టులు చేర్చాలని, జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్యను పెంచాలని కోరారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా జాబ్ క్యాలెండర్‌లో దాదాపు 600 గ్రూప్-1, 2 పోస్టులు ఉంటాయని సమాచారం.
News March 18, 2026
ఈ గ్రామంలో ఉన్నట్టుండి నిద్రపోతారు!

కజకిస్థాన్‌లోని కలాచి అనే గ్రామంలో ప్రజలు ఎప్పుడు, ఎలా నిద్రపోతారో ఎవరికీ తెలియదు. నడుస్తున్నా, మాట్లాడుతున్నా సరే ఒక్కసారిగా గాఢ నిద్రలోకి జారుకుంటారు. ఎవరూ లేపకపోతే రోజుల తరబడి పడుకుండిపోతారు. అందుకే దీనిని ‘స్లీపీ హలో’ అని పిలుస్తారు. సమీపంలోని పాత యురేనియం గనుల నుంచి వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఈ వ్యాధి వచ్చిందని భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో


