News April 20, 2024

IPL: ‘ఇంపాక్ట్ ప్లేయర్’ ఉండాలా.. వద్దా..? (2/2)

image

ఈక్రమంలో రెండు నష్టాలున్నాయి. ఆల్‌రౌండర్లతో జట్లు బౌలింగ్ వేయించడం లేదు. దీంతో నితీశ్ రెడ్డి, దూబే వంటి భారత ఆల్‌రౌండర్ల స్కిల్ మరుగున పడుతోంది. ఇక మరోవైపు బ్యాటింగ్ డెప్త్ పెరగడంతో జట్లు నిర్భయంగా ఆడుతున్నాయి. ఈ సీజన్లోనే జట్ల స్కోర్లు 4సార్లు 250ను దాటడం పరిస్థితికి అద్దం పడుతోంది. మాజీ కోచ్‌లు, రోహిత్ వంటి ఆటగాళ్లు సైతం ఈ రూల్‌ను తొలగించాలని అభిప్రాయపడుతున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.

Similar News

News January 30, 2026

TGTET-2026 ప్రాథమిక ‘కీ’ విడుదల

image

TGTET-2026 ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. ఈ మేరకు టీజీటెట్ ఛైర్మన్ డాక్టర్ నవీన్ నికోలస్ ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక <>వెబ్‌సైట్<<>>లో ‘కీ’ చూసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరాలుంటే అదే వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయొచ్చు. అందుకు ఫిబ్రవరి 1 సాయంత్రం 5 గంటల వరకు అధికారులు సమయం ఇచ్చారు.

News January 30, 2026

ఇండియాలో నిఫా.. వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనన్న WHO

image

WBలో 2 నిఫా కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపింది. దీనిపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో WHO స్పందించింది. ఇండియాలోని నిఫా కేసుల నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువేనని స్పష్టం చేసింది. బాధితులతో కాంటాక్ట్‌లోకి వచ్చిన 196 మందినీ గుర్తించి ఐసోలేట్ చేసినట్లు తెలిపింది. ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదని పేర్కొంది.

News January 30, 2026

వరల్డ్ కప్ గెలిస్తే ఇంకేం చేస్తారో?.. పాక్ పీఎం ట్వీట్‌పై సెటైర్లు!

image

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన ట్వీట్ ఇప్పుడు SMలో ట్రోల్స్‌కు గురవుతోంది. ఆస్ట్రేలియా ‘B’ టీమ్‌పై గెలిస్తేనే ప్రపంచకప్ గెలిచినంతగా PCB ఛైర్మన్‌ను ఆకాశానికెత్తడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక WC గెలిస్తే ఏం చేస్తారో అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ఇది అతిగా ఉందన్నారు.