News April 20, 2024

నిజం చెప్పడం విద్యార్థుల నేరమా?: లోకేశ్

image

AP: విద్యాదీవెన, వసతిదీవెన అందడంలేదని CM జగన్‌కు చెప్పిన విద్యార్థులను ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ సస్పెండ్ చేయడంపై TDP నేత లోకేశ్ స్పందించారు. ‘నిజం చెప్పడం కూడా నేరమా? వైసీపీ నేతలు కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఆ విద్యార్థులను సస్పెండ్ చేయించడం దారుణం. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు విడుదల చేయాలి. స్టూడెంట్స్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News April 8, 2026

డైలీ ఒక్క స్పూన్.. మీ హెల్త్ సేఫ్

image

*హలీం సీడ్స్: 100g రూ.20-30 లోపే. ఇందులోని ఐరన్‌తో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. నీటిలో నానబెట్టి తినొచ్చు.
*గుమ్మడి గింజలు: అరకిలో రూ.120-150కి. ఫైబర్, మెగ్నీషియం, జింక్, హెల్తీ ఫ్యాట్ కండరాలను బలోపేతం చేస్తాయి. నేరుగా తినొచ్చు.
*ఫ్లాక్స్ సీడ్స్: 100g రూ.30-50లోపే. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్, హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. పొడిచేసి తీసుకోవాలి.

News April 8, 2026

ఖబడ్దార్.. కేటీఆర్, హరీశ్‌కు పొంగులేటి వార్నింగ్

image

TG: KTR, హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీ అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉంది. త్వరలో అన్నీ బయటకు వస్తాయి. మీ తాటాకు చప్పుళ్లకు భయపడం.. ఖబడ్దార్’ అని సెక్రటేరియట్‌లో ప్రెస్‌మీట్‌లో హెచ్చరించారు. ఇక నాదర్‌గుల్ భూముల్లో వాటా దక్కకపోవడం వల్లే హరీశ్ తనపై <<19499785>>ఆరోపణలు<<>> చేస్తున్నారని మండిపడ్డారు. వట్టినాగులపల్లి భూములతో తన కొడుకుకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

News April 8, 2026

గ్రీస్‌లో 15ఏళ్లలోపు పిల్లలకు SM నిషేధం!

image

గ్రీస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2027 జనవరి 1 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధిస్తున్నట్లు ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ప్రకటించారు. నిద్రలేమి, మానసిక ఒత్తిడి, SMకి వ్యసనపరులుగా మారుతున్న చిన్నారులను రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేరెంట్స్ అనుమతి ఉన్నా 15 ఏళ్లలోపు వారికి SM బ్యాన్ ఉంటుందన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌లోనూ SMను బ్యాన్ చేశారు.