News April 20, 2024
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: షబ్బీర్

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20మంది తనతో టచ్‌లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘కేసీఆర్ చెప్పింది అబద్ధం. వాళ్ల ముగ్గురు ఎంపీ అభ్యర్థులు మధ్యలో డ్రాప్ అవుతారు. అందుకే ఆయన అబద్ధాలు మాట్లాడుతున్నారు. 10మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌తో టచ్‌లో ఉన్నారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఖాళీ అవుతుంది. ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోం’ అని ఆయన హెచ్చరించారు.
Similar News
News March 23, 2026
దృశ్యం-3 రిలీజ్ వాయిదా

మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న దృశ్యం-3 సినిమా విడుదల వాయిదా పడింది. తన పుట్టిన రోజైన మే 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మోహన్‌లాల్ ఇన్‌స్టాలో వెల్లడించారు. ఈ మూవీని ఏప్రిల్ 2న రిలీజ్ చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన దృశ్యం 1, 2 చిత్రాలు సూపర్ హిట్ కాగా, వాటికి కొనసాగింపుగా మూడో భాగం వస్తోంది.
News March 23, 2026
ఎన్నికల సంఘం లెటర్‌పై బీజేపీ ముద్ర.. కేరళంలో వివాదం!

ఎన్నికల సంఘం లెటర్‌పై BJP సీల్ ఉండటం కేరళంలో వివాదానికి దారి తీసింది. తీవ్ర దుమారం రేగడంతో రాష్ట్ర CEO కేల్కర్ స్పందించారు. ‘ఎన్నికల మార్గదర్శకాలపై 2019 మార్చి 19న EC పంపిన లేఖపై వివరణ కోరుతూ ఇటీవల BJP కేరళం విభాగం CEO ఆఫీసుకు వచ్చింది. అప్పుడు ఇచ్చిన దరఖాస్తుతోపాటు EC లేఖపై పార్టీ సీల్ ఉంది. క్లెరికల్ తప్పిదం వల్ల అది సర్క్యులేట్ అయింది. పొరపాటును గుర్తించి లేఖను ఉపసంహరించుకున్నాం’ అని తెలిపారు.