News April 20, 2024
కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు: కిషన్‌రెడ్డి

TG: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో చాలా బలహీనపడిందని, దాదాపు కనుమరుగైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘5 నెలలు గడిచినా.. కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. లిక్కర్ కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్ఎస్ కూరుకుపోయింది. గెలిచిన ఎమ్మెల్యేలను కూడా నిలబెట్టుకోలేని స్థితిలో ఉంది’ అని ఆరోపించారు.
Similar News
News February 3, 2026
అరకు: చలి ఉత్సవాల్లో పనిచేసిన అధికారులకు ప్రశంస పత్రాలు

అరకు చలి ఉత్సవాలను విజయవంతం చేసిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఈ ఉత్సవాల్లో అంకితభావంతో సేవలందించినందుకు గాను ముగింపు వేడుకల్లో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ చేతుల మీదుగా అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

మెదక్: ప్రభుత్వ ఉద్యోగులారా.. బీ అలర్ట్!

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పార్టీల సభల్లో, ప్రచారాల్లో పాల్గొంటున్నారా? వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో ఫలానా పార్టీకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారా? అయితే, తస్మాత్ జాగ్రత్త! మీ ఉద్యోగం ప్రమాదంలో పడినట్లే! పుర పోరు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం(TSEC) ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే, వేటు వేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేసింది.