News April 20, 2024
చిరంజీవిని జగన్ అవమానించారు: పవన్

AP: రాజానగరం వారాహి సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నా చుట్టూ ఉన్నవారు ఎవరో తెలియాలనే పొగపెట్టా. అందరూ వైసీపీలోకి వెళ్లారు. పోలవరం పూర్తిచేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే. నాపై చాలాసార్లు రాళ్లు విసిరారు, తట్టుకున్నా. జగన్‌లా డ్రామాలు ఆడలేదు. సినిమా టికెట్ ధరలు పెంచాలని వెళ్తే.. చిరంజీవిని జగన్ అవమానించారు’ అని ఫైరయ్యారు.
Similar News
News February 8, 2026
భారత్-అమెరికా డీల్: మన చమురుపై వారి పెత్తనమా?

రష్యా నుంచి చమురు కొనడం ఆపేయని పక్షంలో మళ్లీ 25% టారిఫ్‌లు విధిస్తామన్న US నిబంధనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత చమురు కొనుగోలు నిర్ణయాలను అమెరికా శాసించడం ఏంటని కొందరు నిలదీస్తున్నారు. స్వతంత్ర విదేశాంగ విధానం ఉన్న దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. డీల్ సందర్భంగా ట్రంప్ ఏకపక్ష ప్రకటనలు, ఆయన వాడుతున్న అహంకారపూరిత భాషపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
News February 8, 2026
కిడ్నాప్ కేసులో నోటీసులు.. మంచు విష్ణు రిప్లై!

AP: తిరుపతిలోని MBUలో ఫీజులపై ఆందోళన చేసిన విద్యార్థి సంఘం నేతల <<19041650>>కిడ్నాప్ కేసు<<>> కొత్త మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తిరుచానూరు పోలీసులు మంచు విష్ణుకు (A-3) 5న నోటీసులు జారీ చేశారు. 3 రోజుల్లో విచారణకు రావాలన్నారు. అయితే ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరవుతానని విష్ణు తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో వర్సిటీ PRO సతీశ్ (A-1) సహా పలువురు ఇప్పటికే అరెస్టయ్యారు. A-2గా ఉన్న మోహన్ బాబుకు ఇంకా నోటీసులు అందలేదు.
News February 8, 2026
టాటా ఈవీలపై భారీ డిస్కౌంట్లు!

టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఎలక్ట్రిక్ వెహికల్స్(EV)పై ₹3.80 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. అత్యధికంగా కర్వ్‌పై ₹3.80 లక్షలు-₹3.30 లక్షల దాకా తగ్గించింది. హారియర్-₹1.5 లక్షలు, పంచ్-₹1.6 లక్షలు, టియాగో-₹1.5 లక్షలు, నెక్సాన్‌పై ₹1.2 లక్షలు డిస్కౌంట్ ఇస్తోంది. ఇయర్ వేరియంట్స్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉండనున్నాయి.


