News April 21, 2024

భారత బానిసల పునాదులపై యేల్ వర్సిటీ!

image

పురాతన విద్యాసంస్థల్లో యేల్ యూనివర్సిటీ(US) ఒకటి. దీనికి, భారత్‌కు ఓ సంబంధం ఉంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్ ఎలిహు యేల్. మద్రాస్‌లో 30+ ఏళ్లు ఉన్న ఇతను కొన్ని వేల మంది భారతీయులను బానిసలుగా మార్చి ఎగుమతి చేశాడు. లండన్ వెళ్లిన తర్వాత ఓ US కాలేజీకి డొనేషన్లు ఇచ్చాడు. దీంతో అతని పేరునే దానికి పెట్టారు. కాగా బానిసత్వంతో తమకు సంబంధాలు ఉన్నందుకు ఆ వర్సిటీ ఫిబ్రవరిలో క్షమాపణ చెప్పింది.

Similar News

News November 19, 2024

IND-CHINA: మానసరోవర్ యాత్ర, డైరెక్ట్ ఫ్లైట్స్‌పై చర్చ

image

కరోనా, ఆ తర్వాత తూర్పు లద్దాక్‌లో ఘర్షణల కారణంగా భారత్-చైనా మధ్య 2020 నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు ఆగిపోయాయి. ప్రస్తుతం ఆ విషయంలో పురోగతి కనిపిస్తోంది. జీ20 సమ్మిట్‌లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యీ <<14650227>>భేటీలో<<>> విమానాల పునరుద్ధరణపై చర్చ జరిగింది. అలాగే చైనా సరిహద్దుల మీదుగా సాగే కైలాష్ మానసరోవర్ యాత్ర ప్రారంభంపైనా సానుకూల డిస్కషన్ జరిగింది.

News November 19, 2024

ఆస్ట్రేలియా వ్యూహాలేంటో కోహ్లీకి తెలుసు: మంజ్రేకర్

image

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా పలు వ్యూహాలతో టార్గెట్ చేస్తుందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ఆ వ్యూహాలన్నీ విరాట్‌కు తెలుసని పేర్కొన్నారు. ‘ఆఫ్‌స్టంప్ ఆవల వెళ్లే బంతిని ఆడి ఔటవ్వడం కోహ్లీకి ప్రధాన బలహీనత. దాన్నే కంగారూలు లక్ష్యంగా చేసుకుంటారు. న్యూజిలాండ్ బౌలర్లు సక్సెస్ అయిన తరహాలోనే ఆయన శరీరంపైకి కూడా దాడి చేయొచ్చు’ అని పేర్కొన్నారు.

News November 19, 2024

రేపు YS జగన్ ప్రెస్ మీట్

image

AP: మాజీ సీఎం, వైసీపీ అధినేత YS జగన్ బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడతారని పార్టీ అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు చేసిన ఆయన, మరోసారి మీడియాతో మాట్లాడనుండటంపై ఉత్కంఠ నెలకొంది. అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన విషయం తెలిసిందే.