News December 20, 2025
అమరావతి తప్ప CBNకు ఇంకేమీ పట్టదు: అమర్నాథ్

AP: అమరావతి ప్రొజెక్ట్ అయితే చాలు ఇతర ప్రాంతాలేమైపోయినా ఫర్వాలేదన్నట్లు CM ఉన్నారని YCP నేత G.అమర్నాథ్ విమర్శించారు. ‘విశాఖ భూములను తన వారికి కట్టబెట్టి అక్కడ ఏ యాక్టివిటీ లేకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. సెటిల్మెంట్లపై పవన్ IAS, IPSలను కాకుండా భూముల్ని దోచిపెడుతున్న CBNను ప్రశ్నించాలి. ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు తప్పదు’ అని హెచ్చరించారు. అందర్నీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్నారు.
Similar News
News January 16, 2026
ఎర్ర బెండ రకాల్లో ‘కాశీ లాలిమ’ ప్రత్యేకం

‘కాశీ లాలిమ’ ఎర్ర బెండను IIVR వారణాసి రూపొందించింది. ఈ కాయలు ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి కాయపుచ్చు పురుగు ముప్పు తక్కువ. దీని వల్ల పురుగు మందుల పిచికారీ అవసరం లేదు. చెట్టు పొట్టిగా ఉంటుంది. అందకే దగ్గర దగ్గరగా మొక్కలు నాటుకోవాలి. కాయపై దురద కలిగించే నూగు ఉండదు. అందుకే ఈ బెండ కాయలను సులభంగా కోయవచ్చు. పల్లాకు వైరస్ తెగులును ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ కాయల్లో జిగురు తక్కువగా ఉంటుంది.
News January 16, 2026
మెట్రోను స్వాధీనం చేసుకోండి.. రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ

TG: HYD మెట్రో నెట్‌వర్క్‌ను L&T నుంచి <<17829072>>స్వాధీనం<<>> చేసుకోవాలని సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ తర్వాతే రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని సూచించారు. ‘రెండో దశ సన్నాహాల కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను ప్రతిపాదించలేదు. వెంటనే పేర్లు పంపి సమావేశ నిర్వహణకు ప్రయత్నించండి’ అని పేర్కొన్నారు.
News January 16, 2026
162 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల

NABARD 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి జనవరి 17నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు స్వీకరించనుంది. వయసు 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.32,000 చెల్లిస్తారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ రేపు విడుదల చేయనున్నారు. వెబ్‌సైట్: https://www.nabard.org


