News April 21, 2024

భారీ వరదలు.. అప్రమత్తంగా ఉండండి: చైనా

image

వందేళ్లలో ఒకసారి వచ్చే స్థాయి వరదలు రానున్నాయని, అప్రమత్తంగా ఉండాలని చైనా తమ ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో తీవ్రస్థాయి వర్షాలు కురుస్తున్నాయి. మున్ముందు అవి తీవ్ర స్థాయికి చేరతాయని చైనా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో అత్యవసరంగా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. పెరల్ నది డెల్టా ప్రాంతంలో 19 అడుగుల ఎత్తు వరకు వరద ప్రవాహం రావొచ్చని సర్కారు హెచ్చరించడం గమనార్హం.

Similar News

News November 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 20, 2024

నవంబర్ 20: చరిత్రలో ఈ రోజు

image

1750: మైసూరు రాజు టిప్పు సుల్తాన్ జననం
1910: ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ మరణం
1956: తెలుగు సినీ దర్శకుడు వంశీ జననం
1969: నటి శిల్పా శిరోద్కర్ జననం
1981: భాస్కర-2 ఉపగ్రహాన్ని ప్రయోగించిన ఇస్రో (ఫొటోలో)
1994: నటి ప్రియాంక మోహన్ జననం
* ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం

News November 20, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: నవంబర్ 20, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున 5:08
సూర్యోదయం: ఉదయం 6:24
దుహర్: మధ్యాహ్నం 12:02
అసర్: సాయంత్రం 4:04
మఘ్రిబ్: సాయంత్రం 5:40
ఇష: రాత్రి 6.55
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.