News April 22, 2024
దేశ సమస్యలపై మోదీ మాట్లాడట్లేదు: శరద్ పవార్

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కేవలం కాంగ్రెస్‌పై విమర్శలకే పరిమితమవుతున్నారని, దేశ సమస్యలపై మాట్లాడటం లేదని NCP-SP చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. గతంలో ప్రధానులు దేశ భవిష్యత్తుపై తమ విజన్ గురించి చెప్పేవారని గుర్తు చేశారు. మోదీ మాత్రం ప్రజల్ని ప్రభావితం చేసేందుకు విపక్షాలపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని విమర్శించారు. దేశ సమస్యలను ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని ఆయన పట్టించుకోవట్లేదన్నారు.
Similar News
News March 4, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 4, 2026
TODAY HEADLINES

☛ చంద్రబాబు-పవన్ భేటీ.. జల్ జీవన్ మిషన్, హనుమాన్ ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చ
☛ ఫేస్ రికగ్నిషన్‌తోనే ఇకపై పథకాలు: CM రేవంత్
☛ చంద్రగ్రహణం.. ఎర్రని రంగులో కనువిందు చేసిన చంద్రుడు
☛ కేంద్ర మాజీ మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత
☛ ఇరాన్ అణు కేంద్రం ధ్వంసం: IAEA
☛ యుద్ధ ప్రభావం.. ఇరాన్‌లో 787 మంది మృతి
News March 4, 2026
పాక్‌ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర: ఖవాజా ఆసిఫ్

ఇరాన్‌పై జరుగుతున్న దాడుల వెనుక జియోనిజం(ఇజ్రాయెల్ జాతీయవాదం) ప్లాన్ ఉందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ విమర్శించారు. తమ దేశ సరిహద్దుల వరకు ఇజ్రాయెల్ ప్రాబల్యాన్ని విస్తరించాలని ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. పాక్‌ను సామంత రాజ్యంగా మార్చే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. ఇందులో అఫ్గాన్, ఇండియాకు భాగముందన్నారు. తమ అణుశక్తిని ప్రపంచం గుర్తించిందని, దేశాన్ని కాపాడేందుకు సైన్యం రెడీగా ఉందని చెప్పారు.


