News April 22, 2024

మూడేళ్లలో ‘యాపిల్’ నుంచి 5 లక్షల ఉద్యోగాలు

image

ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ భారత్‌లో వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తోంది. దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని 4-5 ఏళ్లలో రూ.3.32 లక్షల కోట్లకు పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో యాపిల్‌కు 1.5 లక్షల మంది ఉద్యోగులుండగా, మూడేళ్లలో మరో 5 లక్షల మందికి ఉపాధి కల్పించాలనుకుంటోంది. త్వరలోనే భారీగా నియామకాలు చేపడతామని ఆ సంస్థ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

Similar News

News November 20, 2024

ఖాళీ కడుపున వర్కవుట్స్‌తో ఉపయోగాలివే

image

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వర్కవుట్స్ చేయడం వల్ల ఉపయోగాలుంటాయా? ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం.. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే గ్లైకోజెన్ స్థాయులు తగ్గిపోతాయి. పోగైన కొవ్వుల్ని శరీరం శక్తికోసం వాడుతుంది. కొవ్వు వేగంగా కరుగుతుంది. గ్లూకోజ్‌ని మరింత వేగంగా పీల్చుకుంటుంది. దీంతో టైప్ 2 మధుమేహం తగ్గుతుంది. హార్మోన్లు సమతుల్యమవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఏకాగ్రత పెరిగి, చలాకీగా ఉంటారు.

News November 20, 2024

ఈనెల 24న చెన్నైలో ‘పుష్ప-2’ ఈవెంట్!

image

‘పుష్ప-2’ సినిమా టీమ్ ఈనెల 24న చెన్నైలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత 27న కొచ్చిలో ప్రమోషనల్ ఈవెంట్ ఉంటుందని పేర్కొన్నాయి. బెంగళూరు, ముంబై, కోల్ కతా, HYDలోనూ ఈవెంట్స్ జరగనున్నాయి. ఇటీవల పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి 2 లక్షలకు పైగా జనం వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.

News November 20, 2024

డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

image

TG: ఉస్మానియా వర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 21వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 23వ తేదీ వరకు సంబంధిత కాలేజీల్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. వచ్చే నెలలో పరీక్షలు జరగనుండగా, ఎగ్జామ్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇతర వివరాలకు వర్సిటీ <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించాలని సూచించారు.