News December 22, 2025
54 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

<
Similar News
News January 16, 2026
మెట్రోను స్వాధీనం చేసుకోండి.. రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ

TG: HYD మెట్రో నెట్‌వర్క్‌ను L&T నుంచి <<17829072>>స్వాధీనం<<>> చేసుకోవాలని సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆ తర్వాతే రెండో దశ నిర్మాణానికి కావాల్సిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపాలని సూచించారు. ‘రెండో దశ సన్నాహాల కోసం సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పేర్లను ప్రతిపాదించలేదు. వెంటనే పేర్లు పంపి సమావేశ నిర్వహణకు ప్రయత్నించండి’ అని పేర్కొన్నారు.
News January 16, 2026
162 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్ విడుదల

NABARD 162 డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థుల నుంచి జనవరి 17నుంచి ఫిబ్రవరి 3 వరకు దరఖాస్తు స్వీకరించనుంది. వయసు 21 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.32,000 చెల్లిస్తారు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ రేపు విడుదల చేయనున్నారు. వెబ్‌సైట్: https://www.nabard.org
News January 16, 2026
బంగ్లాను దారికి తెచ్చేందుకు జైషా ‘డైరెక్ట్ అటాక్’!

T20 వరల్డ్ కప్ విషయంలో మొండికేస్తున్న బంగ్లా బోర్డును దారికి తెచ్చుకునేందుకు ICC కీలక అడుగు వేయనుంది. ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేసేలా ICC ప్రతినిధుల బృందం త్వరలో బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ‘మేం ఇండియాకు రాబోం’ అని బంగ్లా చెప్పినట్లు తెలుస్తోంది. చివరి యత్నంగా ఈ ‘వన్ టు వన్’ మీటింగ్ నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని ICC డిసైడైనట్లు అర్థమవుతోంది.


