News April 22, 2024

4 చట్ట సభలకూ ప్రాతినిధ్యం.. వెరీ స్పెషల్

image

AP: శాసనసభ, మండలి, లోక్‌సభ, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన నేతలు చాలా అరుదు. నెల్లూరు జిల్లా నేతలకూ ఆ ఘనత దక్కింది. బెజవాడ పాపిరెడ్డి MLC(1958-62), అల్లూరు MLA(1967-72), 1972-78 వరకు రాజ్యసభ సభ్యుడిగా, 1984-89 వరకు ఒంగోలు MPగా పనిచేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1972లో రాజ్యసభకు, 1978లో మండలికి, 1989లో శాసనసభ(వెంకటగిరి)కు, 2సార్లు ఎంపీ(బాపట్ల, నరసరావుపేట)గా పనిచేశారు.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News November 20, 2024

సంక్రాంతి బరిలో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’?

image

తమిళ హీరో అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ముందు ప్రకటించినట్లుగానే 2025 JAN 10న రిలీజ్ కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. నేడో రేపో అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలిపాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా అదే రోజు రిలీజవుతున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‌’కు తమిళనాడులో ఈ సినిమా గట్టి పోటీనిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

News November 20, 2024

కులగణన సర్వే 72 శాతం పూర్తి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే ఇప్పటివరకూ 72% పూర్తయింది. నిన్నటి వరకు 83,64,331 ఇళ్లలో సర్వే చేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ములుగులో 98.9% ఇళ్లలో సర్వే పూర్తయింది. ఆ తర్వాతి రెండు స్థానాల్లో నల్గొండ (95%), జనగామ (93.3%) ఉన్నాయి. హైదరాబాద్‌లో అత్యల్పంగా 50.3% ఇళ్లలో కులగణన జరిగింది.

News November 20, 2024

భాస్కర –II ఉపగ్రహం విశేషాలు

image

1981లో సరిగ్గా ఇదే రోజు రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రయోగ వేదిక నుంచి భాస్కర –II ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. 444KGS బరువు ఉండే ఈ శాటిలైట్ పని చేసే కాలం ఒక సంవత్సరం కాగా, ఇది పదేళ్లు కక్ష్యలో తిరిగింది. భూ పరిశీలన కోసం ప్రయోగించిన భాస్కర శ్రేణిలో ఇది రెండవ ఉపగ్రహం. గణిత శాస్త్రవేత్త మొదటి భాస్కరుడు గుర్తుగా దీనికి ఆ పేరు పెట్టారు. దీనికి ముందు 1979లో భాస్కర-I ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.