News November 20, 2024

సంక్రాంతి బరిలో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’?

image

తమిళ హీరో అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ముందు ప్రకటించినట్లుగానే 2025 JAN 10న రిలీజ్ కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. నేడో రేపో అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలిపాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా అదే రోజు రిలీజవుతున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్‌’కు తమిళనాడులో ఈ సినిమా గట్టి పోటీనిస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

Similar News

News December 12, 2024

నాగార్జున పరువు నష్టం పిటిషన్‌పై విచారణ

image

TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. సురేఖ తరఫున ఆమె లాయర్ కోర్టుకు హాజరయ్యారు. మంత్రి హాజరుకావడానికి మరో డేట్ ఇవ్వాలని కోరారు. దీంతో తదుపరి విచారణను ఈనెల 19కి కోర్టు వాయిదా వేసింది.

News December 12, 2024

తెలుగు సినిమా రేంజ్ ఇదే!

image

‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తమైందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నిన్న ‘పుష్ప-2’ కలెక్షన్లలో రికార్డు సృష్టించడంతో తెలుగు సినిమా రేంజ్ ఇదేనంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 8 రూ.వెయ్యి కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలుంటే అందులో నాలుగు మనవేనంటున్నారు. త్వరలో రిలీజయ్యే ప్రభాస్, మహేశ్ సినిమాలు కూడా ఈ జాబితాలో చేరుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో మీ ఫేవరెట్ ఏంటి?

News December 12, 2024

₹3L కోట్లు: 2024లో INCOME TAX రికార్డులివే..

image

FY25లో ట్యాక్స్ రీఫండ్‌ చెల్లింపుల్లో రికార్డు సృష్టించామని ఫైనాన్స్ మినిస్ట్రీ తెలిపింది. 2024 APR 1 నుంచి NOV 27 వరకు ఏకంగా Rs 3.08 లక్షల కోట్లు చెల్లించినట్టు చెప్పింది. గతేడాది ఇదే టైమ్‌తో పోలిస్తే ఇది 46.31% ఎక్కువని వివరించింది. ఈ ఏడాది గరిష్ఠంగా ఒక సెకనుకు 900, ఒక రోజు 70 లక్షల ITRలు దాఖలైనట్టు పేర్కొంది. AY 2024-25కు సంబంధించి ఒకేరోజు 1.62 కోట్ల ITRలు ప్రాసెస్ చేసినట్టు వెల్లడించింది.